Sreeleela: వరుస సినిమాలతో దూసుకుపోతోన్న యంగ్ బ్యూటీ.. శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్
అందం, చలాకీతనంతో పటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ భామ. పెళ్లి సందడి సినిమా కంటే ముందు పలు కన్నడ సినిమాల్లో నటించింది శ్రీలీల
పెళ్లి సందడి సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో చోటు సంపాందించుకుంది ఈ చిన్నది. అందం, చలాకీతనంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ భామ. పెళ్లి సందడి సినిమా కంటే ముందు పలు కన్నడ సినిమాల్లో నటించింది శ్రీలీల. ఇక తెలుగుతో తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి ఇక్కడ వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ చిన్నదాని ఖాతాలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఇక అనగనగా ఒక రాజా, అదేవిధంగా బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలతోపాటు మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. బాలయ్య నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని సరసన ఏజెంట్ ఫేం సాక్షి వైద్య కథానాయికగా ఎంపికైందని ప్రచారమైంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ మారిందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను హీరోయిన్ గా అనుకుంటున్నారట. శ్రీలీల అయితే రామ్ ఎనర్జీనికి కరెక్ట్ గా మ్యాచ్ చేస్తోందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ 5 న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..