Godfather: ‘గాడ్ ఫాదర్‌’లో సల్మాన్ ఖాన్‌ను తీసుకోవడానికి అసలు కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు

'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు.

Godfather: 'గాడ్ ఫాదర్‌'లో సల్మాన్ ఖాన్‌ను తీసుకోవడానికి అసలు కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు
Director Mohan Raja
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 04, 2022 | 7:21 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు (అక్టోబర్ 5న )గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. గాడ్ ఫాదర్  తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు మోహన్ రాజా విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మోహన్ రాజా మాట్లాడుతూ.. తమిళనాడులో పుట్టాను. కానీ దర్శకుడి గా పుట్టింది మాత్రం తెలుగు చిత్ర పారిశ్రమలోనే. నాన్న గారు వేసిన బాటలో ప్రయణిస్తున్నాం. అయితే నాకు తెలుగు పరిశ్రమకి దూరంగా వున్నాననే భావన లేదు. వరుసగా ఆరు తెలుగు సినిమాలని తమిళ్ లో రీమేక్ చేశా. అలాగే తనివరువన్ ఇక్కడ ధ్రువగా రావడం కూడా ఆనందంగా వుంది. అన్నారు. అలాగే నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనికి. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. తని వరువన్ నుండి నాకు చరణ్ కి పరిచయం ఏర్పడింది. ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నాపేరుని సూచించారు. చరణ్, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది.

లూసిఫర్ లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్ లో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా వుంటాయి అన్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ లాంటి ఇద్దరు మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం అంత సులువైన విషయం కాదు.చాలా ఒత్తిడి వుంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఒత్తిడిని తీసేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా కూల్ వుంటారు. చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని చేశారు సల్మాన్.

ఇవి కూడా చదవండి

లూసిఫర్ లో ప్రుద్వి రాజ్ సుకుమారన్ చేశారు. ఆయన అక్కడ పెద్ద స్టార్. గాడ్ ఫాదర్ కి కూడా ఒక పెద్ద స్టార్ అవసరం పడింది. అయితే ఇది గ్లామర్ కోసం కాదు. ఇందులో హీరో పాత్ర సర్వాంతర్యామి. ఎవరు ఏం గేమ్ ఆడిన ఆయన ఆడే నాటకంలో పాత్రధారులే అంతా. అలాంటి పాత్ర కోసం చెప్పడానికి ఒక పెద్ద స్టార్ కావాలి. ఆయన ఇంట్లో చాలా మంచి పెద్ద స్టార్లు వున్నారు. ఆ పాత్ర గురించి వాళ్ళు చెప్పడం కంటే బయటవారు అయితే మరింత ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుందని భావించాను. చరణ్ , సల్మాన్ స్నేహితులని తెలిసింది. చరణ్  కి చెప్పడం ఆయనే అంతా చూసుకోవడం జరిగింది. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రజన్స్ అదిరిపోతుంది. సల్మాన్ ఖాన్ గారు ఆయన సీన్స్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?