AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

మొత్తం 14 మందిని హౌస్ లోకి పంపించిన విషయం తెలిసిందే. మొదటి వారం ఒకరు హౌస్ నుంచి నేడు ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. మొత్తం 9 మంది నామినేషన్ లో ఉండగా పవర్ అస్త్ర పొంది హీరో శివాజీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో శనివారం జరిగిన ఎపిసోడ్ లో అమర్ దీప్ సేవ్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. తాజాగా నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?
Bigg Boss 7
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2023 | 12:13 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతగా సెకండ్ సీజన్ లో ఆదివారం ఎలిమినేషన్ జరగనుంది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మొత్తం 14 మందిని హౌస్ లోకి పంపించిన విషయం తెలిసిందే. మొదటి వారం ఒకరు హౌస్ నుంచి నేడు ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. మొత్తం 9 మంది నామినేషన్ లో ఉండగా పవర్ అస్త్ర పొంది హీరో శివాజీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో శనివారం జరిగిన ఎపిసోడ్ లో అమర్ దీప్ సేవ్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. తాజాగా నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగార్జున హౌస్ లో ఉన్నవారితో జైమ్స్ ఆడించారు.

మీ ఆటలో మీ కట్టప్ప ఎవరు..? మీ భల్లాలదేవ ఎవరు.? అందుకు కారణం చెప్పులి అని హౌస్ లో ఉన్న వారికి చెప్పాడు నాగ్. ఇందుకోసం  భల్లాలదేవ, కట్టప్ప రెండు బొమ్మలను తలలు లేకుండా ఉంచారు. హౌస్ లో ఉన్నవారు ఎవరు ఒక్కొక్కరు ఎవరిని భల్లాలదేవ, కట్టప్ప అనుకుంటున్నారో వారు అక్కడికి వెళ్లి తలలు పెట్టి నిలుచోవాలి. ఇక ఈ ప్రోమోలో సండే అంటే ఫన్ డే అంటూ మొదలు పెట్టాడు నాగ్. ముందుగా తేజ బాహుబలి కిరీటం , కత్తి పట్టుకొని శివాజీని భల్లాలదేవ అని , గౌతమ్ ను కట్టప్పగా నిలబెట్టాడు. అయితే శివాజీ గేమ్ , ఆయన స్ట్రాటజీలు అర్ధం కావు కరెక్ట్ అయిన ఆపొనెంట్ అని చెప్పాడు. చాలా మంది కట్టప్పలు ఉన్నారు ఎవరిని ఎంచుకోవాలో తెలియడం లేదు అని అంది దామిని. దానికి ముదురు కట్టప్ప ఎవరో వారి పేరు చెప్పు అన్నాడు నాగ్.

అలాగే రతిక కట్టప్పగా శివాజీని ఎంచుకుంది. బహుబలి ని కాపాడేందుకు మంచి మాట్లాలు చెప్తున్నారు అందుకే శివాజీని ఎంచుకుంటున్నా అని తెలిపింది రతిక. అలాగే సందీప్ ను విలన్ న్నీ చేసింది. ఇక షకీలా భల్లాలదేవ గా ప్రశాంత్ ను , కట్టప్పగా ప్రిన్స్ ను ఉంచి ఇద్దరు స్ట్రాంగ్ అని చెప్పింది. ఇక ఈ ప్రోమో చివరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారని ప్రకటించారు నాగ్. అయితే హౌస్ నుంచి షకీలా ఎలిమినేట్ అయ్యేరని టాక్ వినిపిస్తుంది. హౌస్ లో ఉన్నవారందరూ తనకంటే చిన్నవారు కావడం. టాస్క్ ల్లో అంతగా పర్ఫామ్ చేయకపోవడంతో పాటు ఓట్లు కూడా అంతగా రాకపోవడమతొ షకీల ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. అలాగే ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.