Priyanka Jawalkar : పవర్ స్టార్ సాంగ్‌కు క్యూట్ స్టెప్పులేసిన ప్రియాంక జవాల్కర్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవల్కర్. అంతకు ముందు కలవరమాయే అనే సినిమా చేసింది. అది రిలీజ్ అయ్యిందని కూడా చాలా మందికి తెలియదు. ఇక టాక్సీ వాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ , ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆతర్వాత ప్రియాంకకు భారీ ఆఫర్స్ రాలేదు.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, దర్శకులు ఇలా కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. అలా వచ్చిన వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవల్కర్. అంతకు ముందు కలవరమాయే అనే సినిమా చేసింది. అది రిలీజ్ అయ్యిందని కూడా చాలా మందికి తెలియదు. ఇక టాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ , ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ప్రియాంకకు భారీ ఆఫర్స్ రాలేదు.
టాక్సీ వాలా తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్ఆర్ కల్యాణ మండపం అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది . ఆతర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు కరువయ్యాయి. ఎస్ఆర్ కల్యాణ మండపం తర్వాత తిమ్మరుసు, గమనం లాంటి సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
View this post on Instagram
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుందని టాక్ వస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో ప్రియాంక చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాల ఆరబోతలో డోస్ పెంచి దర్శకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
View this post on Instagram
ఈ అమ్మడి హాట్ హాట్ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ప్రియాంక షేర్ శిశ్న ఓ వీడియో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో పాటకు స్టెప్పులేసింది ప్రియనక. పవన్ ను ఇమిటేట్ చేస్తూ ప్యాంట్ పై ప్యాంట్ వేసుకొని తన కుక్కతో కలిసి డాన్స్ చేసింది. ఈ మూవీలోని చిట్టి నడుమునే చూస్తున్న సాంగ్ కు క్యూట్ గా డాన్స్ చేసింది ప్రియాంక. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.