AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు బన్నీ

సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము,..

ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు బన్నీ
Pawan Kalyan , Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2024 | 5:24 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు బాలకృష్ణ. ఆతర్వాత ఎనో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు బాలయ్య.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

బాలకృష్ణ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ. ఇక 50 వసంతాలు  సెలబ్రేషన్స్ కు చాలా మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఇతరభాషలకు సంబందించిన స్టార్స్ ను ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుంచి మాదాల రవి, శివ బాలాజీ , నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్  సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే వేడుకకు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఒకే వేదిక పై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్