పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు, ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్లిళ్లు, విడాకులు కూడా కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పెళ్లైన హీరోలతో ఎఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని ఆ హీరోయిన్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే
Actress
Follow us

|

Updated on: Aug 28, 2024 | 6:01 PM

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ అనేవి కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు, ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్లిళ్లు, విడాకులు కూడా కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పెళ్లైన హీరోలతో ఎఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని ఆ హీరోయిన్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోలతోనే కాదు ఓ క్రికెటర్ తో కూడా ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.? ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె.? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కురాళ్లను తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

పెళ్లైన ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నగ్మా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నగ్మా. తొలి తెలుగు సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ భాషలు ఏలింది. అదే సమయంలో నగ్మా లవ్ ఎఫైర్స్‌  వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

ఈ అమ్మడు ముందుగా హిందీ ఇండస్ట్రీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. సినిమాల్లోకి వచ్చాకా నగ్మాగా మార్చుకుంది. నగ్మా ముందుగా ఇండియన్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పటికే సౌరవ్ గంగూలీ పెళ్లయింది. అయినా కూడా ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ మెయింటేన్ చేశారని టాక్. ఆ తర్వాత వీరి వ్యవహారం సౌరవ్ గంగూలీ భార్యకు తెలియడంతో ఈ ఇద్దరూ విడిపోయారని కూడా టాక్. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్‌తో నగ్మా ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా అప్పటికే పెళ్లి కావడంతో అతని భార్యకు విషయం తెలిసి విడాకుల వరకు వెళ్లడంతో శరత్ కుమార్‌, నగ్మా లవ్ బ్రేక్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రేసుగుర్రం విలన్ రవికిషన్‌తో నగ్మా లవ్ లో పడింది. ఈ ఇద్దరి లవ్ మ్యాటర్ కూడా హైలైట్ అయ్యింది. అతనికి కూడా అప్పటికే పెళ్లయింది. ఈ రిలేషన్ కూడా ఎక్కువకాలం లేదు. ఆతర్వాత ఇప్పుడు నగ్మా ఒంటరిగా ఉంటోంది. 49 ఏళ్ల నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..