Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన చిన్నది గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..
Drushyam
Follow us

|

Updated on: Aug 28, 2024 | 8:17 PM

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అయ్యింది. 2014 లో విడుదలైన ఈ మూవీ మలయాళం, తెలుగు రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన చిన్నది గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

ఆ చిన్నదాని పేరు.. ఎస్తేర్ అనిల్. 2010లో మలయాళ చిత్రం నల్లవన్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత 2013లో జిత్తు జోసెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటించిన దృశ్యం చిత్రంలో చిన్న కూతురుగా నటించి పేరు తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ఇదే పాత్ర చేసింది. వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించింది. అలాగే తమిళ్ రీమేక్ లోనూ ఈ చిన్నది నటించింది. తమిళ్ లో కమల్ హాసన్ నటించారు.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

ఆతర్వాత 2021లో విడుదలైన దృశ్యం 2లో ఎస్తేర్ అనిల్ కాలేజీ విద్యార్థినిగా నటించింది. అలాగే మలయాళం, తమిళ్ లోనూ నటించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హలితా షమీ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన తమిళ చిత్రం మిన్మినిలో ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా చేసింది. ఎస్తేర్ తమిళం, మలయాళం చిత్రాలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించనుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. తన గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ ఫొటోలకు అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. ఆగస్ట్ 27, 2001న జన్మించిన ఎస్తేర్ అనిల్ ఇటీవలే తన 23వ పుట్టినరోజు జరుపుకుంది.

View this post on Instagram

A post shared by Esther Anil (@_estheranil)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.