చియాన్ విక్రమ్‌కి ఏమైంది?.. క్యూ కడుతున్న డిజాస్టర్స్

తెలుగు ఇండస్ట్రీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేంత మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విక్రమ్ ఒకరు. దాదాపుగా రజనీకాంత్ తర్వాత విక్రమ్‌కే క్రేజ్ ఎక్కువ. ఒక సీజన్‌లో ఐతే.. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఒకేరోజు రిలీజయ్యేవి విక్రమ్ సినిమాలు. రజనీకాంత్, కమల్‌హాసన్‌కు ఉన్నట్టుగా తెలుగు ఆడియన్స్‌లో కూడా విక్రమ్‌కు స్పెషల్ ఫ్యాన్స్‌క్లబ్ ఉంది. కానీ ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు తెలుగులో విక్రమ్ అకౌంట్ పూర్తిగా క్లోజ్. విక్రమ్ లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే.. తమిళంలో ఏమైందన్నది అటుంచితే […]

చియాన్ విక్రమ్‌కి ఏమైంది?.. క్యూ కడుతున్న డిజాస్టర్స్
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 27, 2019 | 6:10 PM

తెలుగు ఇండస్ట్రీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేంత మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విక్రమ్ ఒకరు. దాదాపుగా రజనీకాంత్ తర్వాత విక్రమ్‌కే క్రేజ్ ఎక్కువ. ఒక సీజన్‌లో ఐతే.. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఒకేరోజు రిలీజయ్యేవి విక్రమ్ సినిమాలు. రజనీకాంత్, కమల్‌హాసన్‌కు ఉన్నట్టుగా తెలుగు ఆడియన్స్‌లో కూడా విక్రమ్‌కు స్పెషల్ ఫ్యాన్స్‌క్లబ్ ఉంది. కానీ ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు తెలుగులో విక్రమ్ అకౌంట్ పూర్తిగా క్లోజ్. విక్రమ్ లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే.. తమిళంలో ఏమైందన్నది అటుంచితే .. తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ అంటూ వీరలెవెల్లో ప్రమోట్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అసలిది విక్రమ్ సినిమానేనా అనేంత వుంది కలెక్షన్స్ రిపోర్ట్. కమల్‌హాసన్ ఓన్ ప్రొడక్షన్ ఇది. అయినా తెలుగు ప్రేక్షకుడు కరుణించలేదు.

మిస్టర్ కేకే ఒక్కటే కాదు.. రీసెంట్ ఇయర్స్‌లో విక్రమ్ ఖాతాలో ఒక్క హిట్టయినా లేదు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఐ మూవీతో మొదలు పెడితే ..తెలుగులో విక్రమ్‌కి అన్నీ పరాభవాలే. స్కెచ్, సామీ 2, కూడా విక్రమ్ రేంజ్‌ని టచ్ చేయలేకపోయాయి. విక్రమ్ అభిమానుల్ని కూడా ఆకట్టుకోలేదు ఈ సినిమాలు. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాల్ని విక్రమ్ ఫేస్‌వాల్యూ, యాక్టింగ్ టాలెంట్‌తో నడిచినవే. టాలీవుడ్‌లో ఇదంతా ఒక చరిత్ర.

ఇప్పుడు విక్రమ్ కథ పూర్తిగా అడ్డం తిరిగింది. ఇదంతా స్వయంక‌ృతాపరాధమేనా? అంటే అవుననే అంటున్నారు క్రిటిక్స్. స్క్రిప్ట్ ఎంచుకోవడంలో విక్రమ్ నాసిరకం స్టైల్లో వెళ్తున్నాడన్నది విమర్శ. అందుకే విక్రమ్ కెరీర్ ఇంత డల్‌గా వుంది. ఈ క్రైసిస్ నుంచి ఈ అపరిచితుడ్ని కాపాడే సినిమాలు కూడా దరిదాపుల్లో లేవు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu