War 2 OTT: ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఓటీటీలోకి వార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుంకుంది. సినిమా రిలీజ్ కు ముందు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతర్వాత బాలీవుడ్ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నాడు తారక్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 సినిమా ఊహించినంత రెస్పాన్స్ సొంతం చేసుకోలేదు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ మొదటి సారి బాలీవుడ్ లో సినిమా చేస్తుండటం.. పైగా తారక్ తో కలిసి హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటించడంతో మూవీ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. తీరా సినిమా విడుదలైన తర్వాత అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసింది వార్ 2. సినిమా రిజెల్ట్ ఎలా ఉన్న తారక్ క్రేజ్ తో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా రూ. 350కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు వార్ 2 ఓటీటీ రిలీజ్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వార్ ను సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే వార్ 2 ఓటీటీ హాక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వార్ 2 సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది.
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ లో వార్ 2 సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. దాంతో అభిమానులు వార్ 2 సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆరో భాగంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. వార్ 2 సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ యాక్షన్ సినిమాను థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకు సెప్టెంబర్ 12, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








