AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

కుర్ర హీరో విశ్వక్ సేన్ విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు.  హీరోగా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు.

Vishwak Sen: పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Vishwak Sen
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2022 | 8:18 PM

Share

Vishwak Sen: కుర్ర హీరో విశ్వక్ సేన్ విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు.  హీరోగా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముఖ చిత్రం అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్ . వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. డిఫరెంట్ కథాంశంతో రూపొందిన “ముఖచిత్రం” సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు యువ హీరో విశ్వక్ సేన్.  విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారని తెలుస్తుంది. విశ్వక్ సేన్ కు “ముఖచిత్రం” టీమ్ పుట్టినరోజు విశెస్ తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా..ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తుంది. మూవీ టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో “ముఖచిత్రం” సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ముఖచిత్రం” త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి