Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియతో పాటు వారికి పోలీసుల నోటీసులు.. అరెస్ట్ తప్పదా?
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లతో పాటు సినీ ప్రముఖులపైనా కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి విష్ణు ప్రియకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వీరితో పాటు కొందరు సినీ ప్రముఖులపైనా పోలీసులు కేసులు నమోదుచేసినట్లు తెలుస్తోంది. విష్ణుప్రియ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వంటి ప్రముఖులపై పంజా గుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా వీరికి నోటీసులు కూడా పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు ప్రియకు కూడా నోటీసులు వెళ్లాయని తెలుస్తోంది. త్వరలో విచారణకు రావాలంటూ ఆమెకు పంజా గుట్ట పోలీసులు సూచించినట్లు సమాచారం. విష్ణుప్రియతో పాటు బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజకు కూడా నోటీసులు అందించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా విష్ణు ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ విచారణలో ఆమె తప్పు చేసిందని తేలితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి పోలీసుల నోటీసులపై విష్ణు ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నటి విష్ణుప్రియపై కేసు నమోదు, నోటీసులు జారీ | Police file cases against Vishnu Priya – TV9#tv9telugu #vishnupriya #bettingappscam #bettingapps pic.twitter.com/IRlljQfmU6
— TV9 Telugu (@TV9Telugu) March 18, 2025
మరోవైపు సినిమా సెలబ్రెటీలు చాలా మంది బెట్టింగ్ యాప్స్ వద్దు అంటూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ, గెటప్ శీను సహా పలువురు ప్రముఖులు ఈ మధ్యన వీడియోలు రిలీజ్ చేశారు. గతంలో తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సంగతి నిజమేనని అందులో అంగీకరించిన ప్రముఖులు, తెలిసో తెలియకో చేసిన ఈ తప్పుని క్షమించాలంటూ రిక్వెస్ట్ చేశారు.
సుప్రిత రిలీజ్ చేసిన వీడియో..
thanks for all your support ❤️ pic.twitter.com/b55xZpgUW1
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.