AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: అలా అడగ్గానే చెంప పగలగొట్టాలి.. మండిపడ్డ హీరో విశాల్

హేమ కమిటీ నివేదిక, తర్వాత వివాదాలు, హంగామాలు అటు సినీ పరిశ్రమ పై పెద్ద దెబ్బ కొట్టాయి. హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత 'అమ్మ ' సంస్థ కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఒకొక్కరుగ బాధితులు బయటకు వస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలుపుతుంటే..

Vishal: అలా అడగ్గానే చెంప పగలగొట్టాలి.. మండిపడ్డ హీరో విశాల్
Vishal
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2024 | 2:41 PM

Share

హేమ కమిటీ రిపోర్ట్ మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమనే తలకిందులు చేసింది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఈ నివేదికలో బయట పడటంతో మొత్తం ఇండస్ట్రీ కుదేలవుతోంది. హేమ కమిటీ నివేదిక, తర్వాత వివాదాలు, హంగామాలు అటు సినీ పరిశ్రమ పై పెద్ద దెబ్బ కొట్టాయి. హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత ‘అమ్మ ‘ సంస్థ కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఒకొక్కరుగ బాధితులు బయటకు వస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలుపుతుంటే.. మరికొంతమంది డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా మంది అన్ని ఇండస్ట్రీలో ఇలా కమిటీ నిర్వహించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

అమ్మ బోర్డు సభ్యులు మోహన్‌లాల్‌, జడగీష్‌, జయన్‌ చేర్యాల, సిద్ధిక్‌, బాబురాజ్‌, ఉన్నిముకుందన్‌, అనన్య, అన్సిబా హసన్‌, జాయ్‌ మాథ్యూ, జోమోల్‌, కళాభవన్‌ షాజోన్‌, సరయు మోహన్‌, సూరజ్‌ వెంజరమూడ్‌, సురేష్‌ కృష్ణ, టైనీ టామ్‌, టోవినో థామస్‌, వినుమోహన్‌ అమ్మకు రాజీనామా చేశారు. అయితే లైంగిక ఆరోపణలు రావడంతో జనరల్ సెక్రటరీ సిద్ధిక్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

హేమ కమిటీ రిపోర్ట్ పై తాజాగా స్టార్ హీరో విశాల్ మాట్లాడారు. తమిళ్ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు విశాల్. ఆయన మాట్లాడుతూ.. “హేమ కమిటీ రిపోర్ట్‌లోని విషయాలు చూసిన తర్వాత నేను షాకయ్యా. ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం నిజంగా బాధాకరం. సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామని తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పాలి. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆడవాళ్లు దైర్యంగా ఉండాలి. సినిమా అవకాశాల పేరుతో లైంగికంగా వేధించడానికి ప్రయతినిస్తే చెంప చెళ్లుమనిపించాలి. కొంతమంది కేటుగాళ్ళు ఫేక్ ప్రొడక్షన్స్ పేర్లతో కోలీవుడ్‌లోనూ మహిళలను వేధిస్తున్నారని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.. ఈమేరకు ఓ ప్లాన్ రెడీ చేస్తున్నాం అని విశాల్ అన్నారు. నేడు విశాల్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.