AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు.. ఎమోషనల్ అయిన కృతిశెట్టి

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. చూడముచ్చటగా .. క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమా భారీ హిట్ గా నిలిచింది.

Krithi Shetty: నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు.. ఎమోషనల్ అయిన కృతిశెట్టి
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2024 | 3:23 PM

Share

ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ముదగ్గుమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారిలో కృతిశెట్టి ఒకరు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. చూడముచ్చటగా .. క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమా భారీ హిట్ గా నిలిచింది. వందకోట్లకు పైగా ఆ సినిమా వసూల్ చేసింది. దాంతో కృతిశెట్టి క్రేజ్ పెరిగింది. ఉప్పెన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన తర్వాత  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చేసింది. ఈ మూవీ కూడా కృతిశెట్టికి హిట్ తెచ్చిపెట్టింది. దాంతో కృతిశెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, కస్టడీ సినిమాలు చేసింది. ఆతర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమా చేసింది. ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. వరుస ఫ్లాప్స్ పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది. తాజాగా కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కృతి మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా బిగ్ హిట్ అయింది. కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు. కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది. అయితే నేను హిట్స్‌ను, ఫ్లాప్స్‌ను ఒకేలా తీసుకున్నాను. నా సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకొను అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. అయితే కృతి శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.? ఆమె ఫ్లాప్ కోసం ఎదురుచూసింది ఎవరు.? అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.