Virata Parvam: విరాటపర్వం టికెట్స్ రేట్స్ ఫిక్స్.. ఎక్కడ ఎంత ఉన్నాయో తెలుసా ?..
1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఈ సినిమాను
ఎట్టకేలకు మోస్ట్ అవైయిటెడ్ చిత్రం విరాటపర్వం (Virata Parvam) శుక్రవారం (జూన్ 17న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్నగా రానా.. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన విరాటపర్వం పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం హైదరాబాద్ లో విరాట పర్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.. ఇక రేపు ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టికెట్స్ రేట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్..
ఈ ఇతిహాస ప్రేమకథను అందుబాటు ధరల్లోనే వీక్షించండి. అంటూ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ మూవీ టికెట్స్ రేట్స్ ఎంత ఉంటాయో తెలిపింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ. 150 ఉండగా.. ఏపీలో రూ. 147 ఉంది.. అలాగే తెలంగాణలో మల్టీప్లెక్స్ ధర రూ. 200 ఉండగా.. ఏపీలో రూ.177 (జీఎస్టీతో కలిపి)గా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, సాయిచంద్, ఈశ్వరీరావు కీలకపాత్రలలో నటించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు..
ట్వీట్..
Bringing to you an EPIC LOVE STORY, #VirataParvam at very AFFORDABLE prices ??️
Book your tickets now ? https://t.co/m3EcEspUHm IN CINEMAS JUNE 17.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @DivakarManiDOP @SLVCinemasOffl pic.twitter.com/XpQee0ccwq
— Suresh Productions (@SureshProdns) June 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.