AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigil Movie – Lifesaver-ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు

 Bigil Movie - Lifesaver: కొంతమంది వైద్యులు సదరు పేషేంట్స్ కు నచ్చిన సినిమాలు టీవీ షో లు చూపిస్తూ క్రిటికల్ ఆపరేషన్ చేసి సక్సెస్ అందుకున్న వార్తలు తరచుగా..

Bigil Movie - Lifesaver-ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు
Bigil Movi E
Surya Kala
|

Updated on: Jul 08, 2021 | 5:22 PM

Share

Bigil Movie – Lifesaver: కొంతమంది వైద్యులు సదరు పేషేంట్స్ కు నచ్చిన సినిమాలు టీవీ షో లు చూపిస్తూ క్రిటికల్ ఆపరేషన్ చేసి సక్సెస్ అందుకున్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. గతంలో గుంటురులో ఒక వ్యక్తికి బిగ్ బాస్ షో అవతార్ సినిమాను చూపిస్తూ ఆపరేషన్ చేసి వార్తల్లో నిలిచారు. మరొక సారి గుంటూరులోని తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా శస్త్ర చికిత్స చేశారు. అయితే ఈ సారి ఇటువంటి సంఘటన చైన్నై లో చోటు చేసుకుంది. యాక్సిడెంట్ లో గాయపడిన ఓ బాలుడికి బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని రాయ్‌పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే

చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన శశి అనే పదేళ్ల కుర్రాడు తన మేనమామతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. శశి ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పేటలోని ఆస్పత్రికి తరలించారు.

శశిని పరీక్షించిన వైద్య సిబ్బంది.. తలకు తీవ్ర గాయం అయ్యిందని.. రక్తస్రావం ఆపేందుకు వెంటనే కుట్లు వేయాలని చెప్పారు. అయితే ఆ బాలుడు మత్తు ఇస్తుంటే.. ఇంజెక్షన్ చూసి.. తాను ఇంజెక్షన్న్ చేయించుకొని.. నాకు వద్దు అంటూ మారం చేశాడు. ఇంజెక్షన్ అంటే భయంతో గట్టిగా కేకలు వేశాడు.. ఏడిచాడు.. దీంతో డాక్టర్లకు ఏమి చేయాలో పాలుపోలేదు.. ఓ వైపు రక్తస్రావం అవుతుంది. అపకపొతే పిల్లాడి హెల్త్ కు నష్టం.. ఇలా ఆలోచిస్తూ.. ఒక డాక్టర్ పిల్లాడితో స్నేహంగా మాట్లాడుతూ.. శశికి ఇష్టమైనవి ఏమిటి అని తెలుసుకున్నాడు. అప్పుడు శశి తనకు విజయ్ అంటే ఇష్టమని చెప్పాడు.. అంతేకాదు.. బిగిల్ సినిమా అంటే మరీ ఇష్టం అని చెప్పడంతో మత్తు కోసం ఇంజెక్షన్ ని పక్కన పెట్టి.. డాక్టర్లు వెంటనే శశి కోరిక ప్రకారం “విజయ్ సూపర్ హిట్ మూవీ ‘బిగిల్’ ను ప్లే చేశరుసు. శశి ఆ సినిమాలో లీనం కాగానే వైద్యులు దెబ్బలకు కుట్లు వేసి చికిత్స చేశారు. ప్రస్తుతం శశి ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ వార్త # బిగిల్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండ్‌ అవుతుంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘బిగిల్’ ఒక ఫుట్ బాల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ తండ్రి , కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాడు.

Also Read: జురాసిక్‌ పార్క్‌లోని చిన్నసైజ్‌ డైనోసార్లను తలపించిన ఉడుములు.. వైరల్‌ గా మారిన వీడియో