Tollywood: సమస్యకు దారేది..? సినిమాలు ఓటీటీకి ఇవ్వాలా..? వద్దా..?.. టాలీవుడ్‌కు సవాల్‌గా మారిన వ్యవహారం

సినిమాలు ఓటీటీకి ఇవ్వాలా..? వద్దా..?.. ఇస్తే సినిమా హాళ్లు మూతపడతాయని ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇవ్వకుంటే నష్టపోతామని నిర్మాతలు అంటున్నారు. ఇక ఏపీలో...

Tollywood: సమస్యకు దారేది..? సినిమాలు ఓటీటీకి ఇవ్వాలా..? వద్దా..?.. టాలీవుడ్‌కు సవాల్‌గా మారిన వ్యవహారం
Tollywood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 6:25 PM

సినిమాలు ఓటీటీకి ఇవ్వాలా..? వద్దా..?.. ఇస్తే సినిమా హాళ్లు మూతపడతాయని ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇవ్వకుంటే నష్టపోతామని నిర్మాతలు అంటున్నారు. ఇక ఏపీలో 35జీవోతో థియేటర్‌లో బొమ్మ పడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఈ కష్టకాలంలో ఇండస్ట్రీని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చేయూతనిస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వెండితెరపై సందడి కనుమరుగై చాలా రోజులైంది. ఇప్పుడు షూటింగ్‌ల్లేవ్‌.. సినిమాల్లేవ్.. అన్నీ కష్టాలే. అసలు 70ఎంఎంలో బొమ్మపడుతుందా? వెండితెర వెలుగుతుందా? లేదంటే బుల్లితెరతో సర్దుకోవాలా అన్న సందేహాలు మొదలయ్యాయి. నిజానికి సినిమా సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్ల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కరోనా దెబ్బకు ఏడాదిన్నరగా థియేటర్లు మూతపడటంతో.. పరిశ్రమపై ఆధారపడ్డ లక్షలాది మందికి ఉపాధి కరువైంది. సినిమానే నమ్ముకున్న నిర్మాతల ప్రాజెక్ట్‌లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆల్‌రెడీ కంప్లీట్ చేసుకున్న సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి క్రూషియల్ కండీషన్‌లో ప్రొడ్యూసర్‌కి ఓటీటీ ఫార్మాట్ వెలుగురేఖలా కనిపిస్తోంది. కానీ అందుకు ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి.. సినిమా హాళ్లను చంపకండి’ అన్నది ఎగ్జిబిటర్ల ఆవేదన. మరోవైపు 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్‌లు ఓపెన్ చేసే పరిస్థితి లేదంటున్నారు ఓనర్లు. ఇంతకాలం ప్రభుత్వానికి ట్యాక్స్‌ చెల్లించిన తమకు.. కష్టకాలంలో కొంత ప్రభుత్వమే పన్ను రాయితీ కల్పించాలంటున్నారు. సినిమాలపై పెట్టుబడి పెట్టి వడ్డీలు భారం అవుతుంటే ఓటీటీలకు ఇవ్వకుండా నిర్మాతలు ఎంతకాలం ఎదురు చూస్తారన్నది అనుమానమే. ఏపీలో జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. టికెట్‌ రేట్లను ఎడాపెడా పెంచుకునే వీలు లేకుండా.. నిర్దిష్టమైన రేట్లను గవర్నమెంట్ నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన రాయితీలను మరికొంత కాలం పొడిగించాలని థియేటర్స్, మల్టీప్లెక్స్‌ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాలు కష్టాల్లో ఉన్న చిత్ర పరిశ్రమకు చేయూతనిస్తారా..? థియేటర్‌లో బొమ్మ పడేలా సహకారం అందిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది.

Also Read: బండి బయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.. పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర 100 దాటి ఎందుకు పోతుంది?

హీరోగా మారనున్న బండ్ల గణేష్‌.. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌.. ఈసారైనా పక్కానా.?