బండి బయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.. పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర 100 దాటి ఎందుకు పోతుంది?

Petrol price in India: ఓ వైపు వానలు దంచికొడుతుంటే.. ఇంకోవైపు పెట్రోల్‌, డీజిల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. తగ్గేదే లే అంటూ ఆల్‌ టైమ్ హైకి చేరుకున్నాయి. అడ్డూ అదుపు లేకుండా..

బండి బయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.. పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర 100 దాటి ఎందుకు పోతుంది?
Petrol Price Today
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 5:04 PM

ఓ వైపు వానలు దంచికొడుతుంటే.. ఇంకోవైపు పెట్రోల్‌, డీజిల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. తగ్గేదే లే అంటూ ఆల్‌ టైమ్ హైకి చేరుకున్నాయి. అడ్డూ అదుపు లేకుండా.. పైపైకి ఎగబాకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్‌ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. పెట్రోల్‌ సెంచరీ కొట్టడమే కాదూ.. అంతకుమించి అనేలా దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా తొంబైల్లోకి వచ్చిన లీటర్‌ పెట్రోల్‌ ధర.. అప్పటి నుంచి పరుగులు పెడుతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఉన్నా.. పెట్రో రేట్లకు మాత్రం లాక్‌ వేయలేకపోయాయి ప్రభుత్వాలు. ఏపీ, తెలంగాణలో లీటర్ పెట్రోల్‌ ధర వందదాటేసి చాలారోజులైంది. గతేడాది ఇదే సమయంలో ఐదొందలు కొడితే ఆరు లీటర్ల పెట్రోల్ వచ్చేది. కానీ ఇప్పుడు అదే ఐదొందలకు ఐదు లీటర్ల పెట్రోల్‌ కూడా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పెట్రోల్ రేట్లు పెరగడం అంటే సామాన్యుడికి తినే ముద్ద దూరమవుతున్నట్టే లెక్క. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా లక్షల మంది ఇప్పటికే రోడ్డునపడ్డారు. ఉద్యోగాల్లేక, ఆదాయంలేక, ఎక్కడికి వెళ్లాలన్నా బండి తీసుకుని వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెరుగుదలతో.. నిత్యావసరాలు, అత్యవసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ఏ వస్తువుని పట్టుకున్నా.. రేట్లు చుక్కలు కనిపిస్తున్నాయి.

సెంచరీ దాటేసి పరుగులు తీస్తున్న పెట్రో మంటకు కారణం ఎవరు? పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర వంద దాటి ఎందుకు పోతుంది? ఈ సెస్సులు, ట్యాక్సులు ఎవరు ఎవరి కోసం బాదుతున్నారు?. నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలతో అదనపు భారం పడుతోంది. దీనికి తోడు పెట్రోల్‌ ధరలు నిత్యం పెరుగుతుండడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బైకులు, కార్లు బయటకు తీయాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా నాన్‌స్టాప్‌గా పెరుగుతూ పోతుంటే.. ఇంధనంతో నడిచే వాహనాలు తగ్గించుకోవాల్సిందేనా?. నిజానికి పెట్రోల్, డీజిల్ లాంటివి జీఎస్‌టీ పరిధిలోకి రావు. కేంద్ర ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయి. దీంతో నాన్‌స్టాప్‌గా ఆయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కష్టకాలంలో ప్రభుత్వాలు ఈ వడ్డింపు ఎందుకు తగ్గించడం లేదన్నది అర్థంకాని ప్రశ్న.

Also Read:  కృష్ణా జలాల వివాదంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. తొలిసారి కాస్త సీరియస్‌గా

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారు, ఆయన స్ఫూర్తితోనే ముందుకు: సీఎం జగన్