తీవ్ర విషాదంలో మునిగిన భారత్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఆర్ఎస్ఎస్ దిగ్భ్రాంతి..!
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పీవీ నరసింహరావుతో కలిసి మన్మోహన్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించారు. ప్రస్తుతం అనుభవిస్తున్న ఎన్నో ఫలాలు ఈ జుగల్‌బందీ పుణ్యమే అంటే అతిశయోక్తి కాదు. 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్.. అప్పట్నుంచి 2024 ఏప్రిల్ వరకు 33ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. పదేళ్లపాటు ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు.
భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, భారతదేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొనియాడు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం (డిసెంబర్ 26) కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. శుక్రవారం జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం(డిసెంబర్ 28) పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
మౌనముని అని విమర్శకులు మన్మోహన్‌పై ఒక ముద్ర వేశారు. దేశ ప్రధానమంత్రిలలో మన్మోహన్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షాలు సైతం ప్రశంసించిన దార్శనికత ఆయన సొంతం. మాజీ ప్రధాని మృతి పట్ల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని, దేశ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అతని కుటుంబానికి, ఆయన అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్, సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. దేశాభివృద్ధిలో మన్మోహన్ సింగ్ సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యావ్ భారత దేశం ఇది గుర్తుంచుకుంటుంది. మరణించిన ఆయన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.” అంటూ ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సర్కార్యవః దత్తాత్రేయ హోసబాలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
The entire nation is extremely saddened by the demise of former Prime Minister of Bharat and senior leader of the country Dr. Sardar Manmohan Singh. Rashtriya Swayamsevak Sangh expresses its deepest condolences to his family and countless loved ones and admirers. Dr. Manmohan… pic.twitter.com/3sAt9dgTne
— RSS (@RSSorg) December 27, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఈ కాలంలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే భారతదేశంలోని అన్ని ప్రదేశాలలో త్రివర్ణ పతాకం సగం మాస్ట్‌లో ఉంటుంది. జాతీయ సంతాప సమయంలో అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవు. అంత్యక్రియలు జరిగే రోజు విదేశాల్లోని అన్ని భారత రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాను కూడా అర మాస్ట్‌లో ఎగురవేస్తామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..