AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారు, ఆయన స్ఫూర్తితోనే ముందుకు: సీఎం జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని సీఎం జగన్ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని..

CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారు, ఆయన స్ఫూర్తితోనే ముందుకు: సీఎం జగన్
Ap Farrmers Day
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2021 | 4:07 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని సీఎం జగన్ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అనంతలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారని జగన్ వెల్లడించారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్‌ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని కొనియాడారు. వైఎస్‌ స్ఫూర్తిగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా వైసీపీ పాలన సాగిస్తోందన్నారు. కరోనా తదితర సవాళ్లు ఎదురైనా..ఎక్కడా రాజీపడలేదన్నారు.  3,800 కి.మీ. పాదయాత్రలో రైతుల కష్టాలు చూశానని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పెట్టుబడి ఖర్చులు ఇచ్చి రైతులకు అండగా నిలిచామని, రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు అందజేశామన్నారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్‌బీకేల ద్వారా ఈ-క్రాప్‌ చేపడుతున్నామన్న జగన్… పంటలకు సంబంధించి వివరాలను ఆర్‌బీకేల్లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ-క్రాప్‌ తర్వాత పంటల బీమా సహా అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

ఆర్‌బీకేల ద్వారా తక్కువ అద్దెకు రైతులకు పనిముట్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా పంటలకు కనీస గిట్టుబాటు కల్పిస్తామన్నారు. రైతుల ఆదాయం పెంపునకు చేయూత ద్వారా పశువుల కొనుగోళ్లకు సాయం చేస్తున్నామన్నారు. అమూల్‌ ద్వారా పాల ధరలు పెంచి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పాల విప్లవాన్ని తీసుకొస్తామని.. తక్కువ విద్యుత్‌ ధరలతో ఆక్వా రైతులకు అండగా నిలుస్తున్నామని జగన్ వెల్లడించారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ దిగువన చూడండి….

Also Read: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా.. తాజా వివరాలు ఇలా ఉన్నాయి

మళ్లీ కలవరపెడుతున్న కరోనా కేసులు.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక లేఖలు.. కఠినంగా వ్యవహరించాలని సూచన

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?