నా కొడుక్కి మంత్రి పదవి ఇవ్వరా..? మూల్యం చెల్లించుకుంటారు.. బీజేపీపై ధ్వజమెత్తిన నిషాద్ పార్టీ చీఫ్

యూపీలో బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ బీజేపీపైనే మండిపడుతున్నారు. తన కుమారుడు, ఎంపీ ప్రవీణ్ నిషాద్ కి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించనందుకు ఈ పార్టీ మీద నిప్పులు కక్కుతున్నారు.

నా కొడుక్కి మంత్రి పదవి ఇవ్వరా..? మూల్యం చెల్లించుకుంటారు.. బీజేపీపై ధ్వజమెత్తిన నిషాద్ పార్టీ చీఫ్
Nishad Party Chef
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 08, 2021 | 6:50 PM

యూపీలో బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ బీజేపీపైనే మండిపడుతున్నారు. తన కుమారుడు, ఎంపీ ప్రవీణ్ నిషాద్ కి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించనందుకు ఈ పార్టీ మీద నిప్పులు కక్కుతున్నారు. అప్నా దళ్ కి చెందిన అనుప్రియ పటేల్ ని మంత్రి మండలిలో చేర్చుకున్నప్పుడు ఆమె కన్నా ఎక్కువ పాపులారిటీ కలిగిన తన కుమారుడికి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. మా నిషాద్ కులస్థులు ఇప్పుడు బీజేపీ అంటేనే ఆగ్రహంతో ఉన్నారని, ప్రవీణ్ నిషాద్ కి 160 నియోజకవర్గాల్లో పాపులారిటీ ఉంటే అనుప్రియ పటేల్ కి కొన్ని చోట్ల మాత్రమే ఆదరణ ఉందని ఆయన చెప్పారు. తన నిరసనను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, హోమ్ మంత్రి అమిత్ షాకు అప్పుడే తెలియజేశానన్నారు.ఇప్పటికైనా వారు ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

సంజయ్ నిషాద్ కొడుకు ప్రవీణ్ గోరఖ్ పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఈయన అభ్యర్థిత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతునిచ్చింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఎన్నిక కావడంతో గోరఖ్ పూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక మీర్జాపూర్ నుంచి 2014 లో ఎన్నికైన అనుప్రియ పటేల్ కి నిన్నటి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆమెకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పోర్టు ఫోలియో లభించింది. కాగా వచ్చేఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ నిషాద్ కులస్థుల ఓట్లను సంజయ్ నిషాద్ బీజేపీకి ‘ఎర’గా వేస్తున్నారా.. ఆ బూచిని చూపుతున్నారా అని విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుకలా.. ?? ఎక్కడ..??

Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్