బెంగుళూరులో గ్యాంగ్ రేప్ కేసు..12 మంది అరెస్టు..!! నిందితుల్లో ఇద్దరు మహిళలు..!!

బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతిపై బెంగుళూరులో గ్యాంగ్ రేప్ చేసి ఆమెను టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు.

బెంగుళూరులో గ్యాంగ్ రేప్ కేసు..12 మంది అరెస్టు..!! నిందితుల్లో ఇద్దరు మహిళలు..!!
12 Arrested In Gang Rape Case
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 08, 2021 | 7:05 PM

బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతిపై బెంగుళూరులో గ్యాంగ్ రేప్ చేసి ఆమెను టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మిగిలినవారు బంగ్లాదేశీయులు. 5 వారాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని బెంగుళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ అభినందించారు. ఈ టీమ్ కి లక్ష రూపాయల రివార్డును మంజూరు చేశారు. ఈ ఏడాది మే నెలలో ఈ గ్యాంగ్ రేప్ జరిగిందని, నిందితులు ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని పోలీసులు తెలిపారు. 22 ఏళ్ళ బాధితురాలి పట్ల వీరు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని. వారు చెప్పారు. బంగ్లాదేశ్ లో మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే ముఠా ఉందని.ఈ ముఠా సభ్యులు మూడేళ్ళ క్రితం ఈ బాధితురాలిని అస్సాం, బెంగాల్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు తిప్పారని ఖాకీలు వెల్లడించారు.

అనంతరం ఆమెను వ్యభిచారంలోకి దింపారన్నారు. ఏదో ఆర్ధిక పరమైన వివాదం వల్లే ఈ నిందితులు ఆమె పట్ల కక్ష పెంచుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇద్దరు మహిళలు కూడా ఈ గ్యాంగ్ రేప్ ముఠాకు సహకరించడం ఆశ్ఛర్యంగా ఉందని వారు పేర్కొన్నారు. సుమారు రెండు నెలల క్రితమే కేసు దర్యాప్తు జరుగుతుండగా ముగ్గురు నిందితులు పారిపోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరిపి గాయపరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అటు ఈ కేసు దర్యాప్తు ముగిసిందని తెలిపిన పోలీసు కమిషనర్..చార్జిషీటును కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Suspicious death డ్యూటీకంటూ వెళ్లాడు.. లారీలో విగతజీవిగా కనిపించాడు.. గుంటూరు జిల్లాలో అనుమానాస్పద మృతి

Zika virus : కేరళలో మళ్ళీ వెలుగులోకి వచ్చిన జికా వైరస్ .. గర్భిణికి నిర్ధారణ.. మరో 13 మంది అనుమానితులు

Latest Articles
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో