Zika Virus : కేరళలో జికా వైరస్ కలకలం .. గర్భిణికి నిర్ధారణ.. మరో 13 మంది అనుమానితులు
Zika virus In Kerala: ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. తాజాగా తిరువనంతపురంలోని..
Zika virus In Kerala: ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చి ఆందోళలన రేకెత్తిస్తోంది. తాజాగా తిరువనంతపురంలోని జికా వైరస్ కేసు నిర్ధారింప బడిందని ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ తెలిపారు. బాధితురాలు తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పరస్సాలాకు చెందిన 24 ఏళ్ల గర్భిణీ స్త్రీకి ఈ వ్యాధి బారినపడింది.
జూన్ 28న బాధితురాలు జ్వరం, తలనొప్పి తో పాటు , చర్మంపై ఎర్రటి గుర్తులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి చికిత్సనిమిత్తం వెళ్ళింది. ప్రాధమిక పరీక్షలలో ఆమెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె శాంపిల్స్ ను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) కు పంపారు. చికిత్స పొందుతున్న బాధితురాలు జూన్ 7న పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య అధికారులు చెప్పారు.
జికా వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధిని నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టింది. సంబంధిత అధికారులు, నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నివారణ చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేశారు. మరోవైపు తిరువనంతపురం జిల్లా నుంచి 19 శాంపిల్స్ ను పరీక్ష నిమిత్తం పంపించారు. వాటిల్లో 13 పాజిటివ్ కేసులని అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ఎన్‌ఐవి ఇంకా ధృవీకరించాల్సి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఈ జికా వైరస్ అనేది దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధి. జికా వైరస్ యొక్క లక్షణాలు చికున్‌గున్యా మాదిరిగానే ఉంటాయి. పగటిపూట చంచరించే ఏడెస్ దోమల నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అయితే ఈ జికా వైరస్ సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయదు. రోగి విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది అయితే, వైరస్ గర్భిణీ స్త్రీలకు సోకితే, ఆ ప్రభావం పుట్టే పిల్లలపై ప్రభావం చూపిస్తుందని.. వారిలోని లోపాలకు దారితీయవచ్చని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
Also Read: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్