Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్

Contact Lenses: కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవడం ఫ్యాషన్ గా ఫీల్ అయ్యి.. అవసరం ఉన్నా లేకపోయినా కళ్లజోడుని పెట్టుకుంటారు. అయితే మరికొందరికి కళ్ళజోడు తప్పని సరి..

Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్
Contact Lenses
Follow us

|

Updated on: Jul 08, 2021 | 6:43 PM

Contact Lenses: కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవడం ఫ్యాషన్ గా ఫీల్ అయ్యి.. అవసరం ఉన్నా లేకపోయినా కళ్లజోడుని పెట్టుకుంటారు. అయితే మరికొందరికి కళ్ళజోడు తప్పని సరి.. అయినా తమ అందాన్ని తగ్గిస్తుందని.. కాంటాక్ట్ లెన్స్ ను ఉపయోగిస్తారు. అసలే సున్నితమైన అవయవాల్లో ఒకటి కళ్ళు.. కంటి సున్నితమైన పొరపై కటకాల పొరలను అమర్చుకోవడమంటే కొంచెం కష్టమైన పనే కాదు.. అది కొన్ని సార్లు ప్రమాద కరంగా కూడా మారుతుంది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం లో ఏ మాత్రం తేడా వచ్చినా కంటి చూపు పై ప్రభావం చూపిస్తుంది. కొంతమంది కళ్ళు ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతాయి. అందుకనే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనేవారు చాలా జాగ్రత్తలు పాటించాలని.. దుమ్ము-దూళీకి దూరంగా ఉండాలని కంటి వైద్యులు సూచిస్తారు. ఇక కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని నిద్ర పోవద్దని వైద్యులు హెచ్చరిస్తారు కూడా.. అయితే ఓ మహిళ డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలను వినిపించుకోలేదు..కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం వహించి ఇప్పుడు ఆస్పత్రి పాలైంది. నిర్లక్షం ఖరీదు తన కంటి చూపు పోగొట్టుకునే వరకూ తెచ్చుకుంది.. ఈ ఘటన యుకె లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

యూకేకు చెందిన 67 ఏళ్ల మహిళ సుమారుగా 35 ఏళ్ల నుంచి కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తుంది. అయితే వాటిని ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఇటీవల ఆమె తన కళ్ళు పొడిబారిపోతున్నాయని, దురద పెడుతున్నాయంటూ వైద్యులను సంప్రదించింది. అయితే కళ్ళకు ఈ సమస్యలు వయసు రీత్యా వచ్చినవని భావించారు. కాట్రాక్ట్ సర్జరీ చేయాలని నిర్ణయించిన వైద్యులు ఆమె కంటికి పరీక్షలు నిర్వహించారు.

ఆ పరీక్షలో వైద్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ మహిళ కుడి కంటి గుడ్డు వెనుక కాంటాక్ట్ లెన్స్ పేరుకుపోయి కనిపించాయి. వెంటనే శాస్త్ర చికిత్స చేసి.. ఒకటి దానికి ఒకటి అతుక్కున్న కాంటాక్ట్ లెన్స్ ను బయటకు తీశారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 కాంటాక్ట్ లెన్స్ ను బయటకు తీశారు. ఇదే విషయాన్ని బ్రిటీష్ మెడికల్ జనరల్’లో ఈ అరుదైన కేసుగా ప్రస్తావించారు. అంతేకాదు ఇకనైనా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఆ మహిళకు చికిత్సనందించిన ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ ట్రైనీ రుపల్ మొర్జారియా ఇదే విషయంపై స్పందిస్తూ.. మె సుమారు 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తోందని చెప్పారు. అయితే కాంటాక్ట్ లెన్స్ వాడే విషయం లో పెద్దగా శ్రద్ధ చూపించలేదని.. లెన్స్ పెట్టుకుని నిద్రపోయిందని.. అవి కనిపించినప్పుడు ఎక్కడో పడిపోయి ఉంటాయని మళ్ళీ కొత్తవి పెట్టుకొనేదని తెలిపారు. అయితే ఇప్పుడు కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే వరకూ ఆమెకు ఈ విషయం తెలియదని.. కంటి చూపు విషయంలో ఎటువంటి సమస్య రాలేదని అన్నారు. తాను ఇప్పటి వరకూ ఇలాంటి కేసుని చూడలేదని చెప్పారు.. ఆపరేషన్ అనంతరం కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచామని మొర్జారియా చెప్పారు.

Also Read: గోదావరి జిల్లాల స్టైల్ లో అమ్మమ్మ కాలంనాటి పులస చేప పులుసు రెసిపీ..