Konaseema Pulasa Pulusu: గోదావరి జిల్లాల స్టైల్ లో అమ్మమ్మ కాలంనాటి పులస చేప పులుసు రెసిపీ..

Konaseema Pulasa Pulusu: వర్షాకాలం వచ్చిందంటే చటుక్కున గుర్తొచ్చేది ఇంకొకటి ఉంది. అదే పులస.. వర్షా కాలం గోదాట్లోకి వచ్చే కొత్త నీటికి ఎదురీదే పులస చేపంటే పెద్ద క్రేజ. ఎంతగా అంటే ..

Konaseema Pulasa Pulusu: గోదావరి జిల్లాల స్టైల్ లో అమ్మమ్మ కాలంనాటి పులస చేప పులుసు రెసిపీ..
Pulasala Pulusu
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2021 | 6:13 PM

Konaseema Pulasa Pulusu: గోదావరి జిల్లాలు అనగానే కొబ్బరి చెట్లు, వెన్నెల్లో గోదారి.. పూతరేకులు, కాకినాడ కాజా ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. వీటన్నిటి తో పాటు వర్షాకాలం వచ్చిందంటే చటుక్కున గుర్తొచ్చేది ఇంకొకటి ఉంది. అదే పులస.. వర్షా కాలం గోదాట్లోకి వచ్చే కొత్త నీటికి ఎదురీదే పులస చేపంటే పెద్ద క్రేజ. ఎంతగా అంటే .. పెళ్ళాం పుస్తెలు తాకట్టి అయినా పులస కొనుక్కు తినాలన్నంతగా.. పులస చేపలో ఆడా, మగా వుంటాయి. ఆడ పులసని ‘శనపులస’, అనీ,మగ పులసని ‘పోతు పులసని ‘ అంటారు. మరి ఇందులో ఏది ఎక్కువ రుచంటే ..రెండూను.  దేని రుచి దానిదే. పులస చేప పులుసు ఎలా పెట్టాలో వంశీ చెప్పిన రెసిపీ ని ఈ రోజు తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

శుభ్రం చేసిన పులస చేప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ రేకలు, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి నూరిన ముద్ద పచ్చి మిర్చి నువ్వుల నూనె చింతపండు (లేత కొబ్బరి నీళ్లలో బెట్టితే మంచి రుచి వస్తుంది) బెండకాయ ముక్కలు వెన్నపూస ముద్ద కొంచెం ఆవకాయ నూనె మట్టిదాక ఉప్పు రుచికి సరిపడా పసుపు కొంచెం కారం

పులుసు వండే విధానం…

చేప పులుసు తయారీకి ముందుగా చేప ముక్కలను కొంచెం శనగ పిండి వేసి శుభ్రంగా కడుక్కోవాలి.. తర్వాత ఆ చేప ముక్కలను ఓ పక్కకు పెట్టి.. కట్టెల పొయ్యి మీద మట్టిదాక ను పెట్టి.. ముందుగా నువ్వుల నూనె వేయాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత ఉల్లి పాయ ముక్కలను వేయించాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయించాలి.. తర్వాత వెల్లుల్లిపాయ రేకలు,అల్లం జీలకర్ర,ధనియాలు కలిపి నూరిన ముద్దను వేసుకుని పచ్చి మిర్చి, కొంచెం కారం వేసి వేయించాలి..  అవి దోరగా వేగిన తర్వాత లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టిన పాత చింతపండును పులుసుగా పిసికి దాక సగానికి పైగా నిండేలాగ వేయాలి.

తర్వాత లేత బెండకాయ ముక్కలు వేసి, ఆ తర్వాత ఒకో చేప ముక్కా పులుసులో మునిగేలా వేయాలి. అలా అన్ని ముక్కలు .. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత లేత సెగలో పులుసు మరిగేలా మంటను పెట్టుకోవాలి.  పావు గంట తర్వత పులుసు కమ్మసి వాసన వస్తుంది. అప్పుడు సన్నటి నిప్పుల సెగ మీద పులుసుని మరిగిస్తే.. పులుసు చిక్కబడుతుంది. తర్వాత పొయ్యి మీదనుంచి పులస పులుసుని దింపేసి.. దానిలో ఆవకాయ నూనె.. కొంచెం వెన్నపూస ముద్ద వేయాలి.. అయితే ఈ పులసల పులుసు వేడి వేడిగా తినే కంటే.. .ఉడికిన పులుసు రాత్రంతా మట్టిదాకలోనే చల్లారితే అప్పుడు దాని అసలు రుచి బయటకు వస్తుంది. వేడి వేడి అన్నంలో చల్లారిన పులసల పులుసు తింటే ఆహా ఏమి రుచి అంటారు ఎవరైనా

Also Read: ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు