Prashant Kishor: వాట్ ఈజ్ నెక్ట్స్? ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం కోసం పనిచేయబోతున్నారా?

Prashant Kishor: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.

Prashant Kishor: వాట్ ఈజ్ నెక్ట్స్? ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం కోసం పనిచేయబోతున్నారా?
Prashant Kishor
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 08, 2021 | 5:51 PM

Prashant Kishor – Amarinder Singh: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆమె పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్(IPAC) పనిచేసింది. మమతను తిరిగి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవడంలో పీకే రాజకీయ వ్యూహాలు బాగా అక్కరకు వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను రాజకీయ వ్యూహరచన నుంచి తప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మోడీని ధీటుగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడంపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టారు. ఇందు కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు తగిన రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన చేపట్టబోయే నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పంజాబ్‌‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమరీందర్ సింగ్ కోసం పనిచేసిన పీకే టీమ్ మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు మరోసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పీకే పనిచేయబోతున్నట్లు సమాచారం.సిద్ధు అసమ్మతి గళం, ప్రభుత్వ వ్యతిరేకతను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధిగమించేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అక్కరకు వస్తాయని అమరీందర్ ఆశలు పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Prashant Amarinder

Prashant Kishor- Punjab CM Amarinder Singh

ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతూ ఢిల్లీలో పర్యటిస్తున్న అమరీందర్ సింగ్‌ పీకే‌తో బుధవారంనాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారంనాడు కలిసిన అమరీందర్ సింగ్…మరుసటి రోజే ప్రశాంత్ కిషోర్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంట పాటు వారిద్దరి మధ్య భేటీ సాగింది. వీలైనంత త్వరగా ప్రచారపని మొదలుపెట్టాలని పీకేను అమరీందర్ సింగ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే మర్యాదపూర్వకంగానే సీఎం అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్‌ను కలిశారని..పంజాబ్‌లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే అంశంపై చర్చించలేదని పీకే టీమ్ చెబుతోంది.

Also Read..

 అందుకే మంత్రి పదవి పోయిందా.. హర్షవర్ధన్‌ ఉద్వాసనపై ఢిల్లీ పొలిటికల్ స్ట్రీట్‌లో పెద్ద చర్చ..

కేసీఆర్‌తో తలపడాలంటే డైలాగ్స్ కొడితే చాలదు.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదీలేదుః కేటీఆర్