Viral Video: పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుకలా.. ?? ఎక్కడ..??

యూపీలోని హామిర్ పూర్ లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. వెరైటీగా ఓ చిన్నపాటి ఎత్తయిన స్టేజీని ఏర్పాటు చేసి దానిపై కమలం టైపులో గుండ్రంగా తిరుగుతున్న వేదిక మీద వధూవరులు పూలమాలలు మార్చుకునేలా తీర్చిదిద్దారు.

Viral Video: పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి...!! ఎందుకలా.. ?? ఎక్కడ..??
Mother Beats Him With Chappal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 08, 2021 | 6:48 PM

యూపీలోని హామిర్ పూర్ లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. వెరైటీగా ఓ చిన్నపాటి ఎత్తయిన స్టేజీని ఏర్పాటు చేసి దానిపై కమలం టైపులో గుండ్రంగా తిరుగుతున్న వేదిక మీద వధూవరులు పూలమాలలు మార్చుకునేలా తీర్చిదిద్దారు. ఇదంతా సంబరంగా జరుగుతుండగా.. హఠాత్తుగా వరుడి తల్లి అక్కడికి చేరుకుంది. ఎవరూ ఊహించనంత వేగంగా ఈ వేదికనెక్కి వరుడిని తిడుతూ చెప్పు తీసి కొట్టింది. అంతటితో ఆగక..అతడ్ని కిందికి లాగివేసేందుకు యత్నించింది. ఇది చూసిన ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా కిందికి లాక్కుని వచ్చాడు. ఈ ఘటనతో అంతా బిత్తరపోయి అక్కడినుంచి నిష్క్రమించారు. ఈ వ్యవహారమంతా వీడియోకెక్కి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ మహిళ అంతమందిలో ..అందులోనూ పెళ్లి జరుగుతుండగా తన కొడుకును చెప్పుతో ఎందుకు కొట్టిందంటే..తన అభీష్టానికి వ్యతిరేకంగా ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడమే.

తల్లిని, తండ్రిని కాదని ఆ యువకుడు ఈమెను మొదట కోర్టులో పెళ్లి చేసుకున్నాడట. అయితే ఆ యువతి తలిదండ్రులు మాత్రం తమ కూతురి వెడ్డింగ్ ని అతనితోనే మళ్ళీ వైభవంగా చేయదలిచి ఈ నెల 3 న ఓ ఫంక్షన్ హాలులో ఇందుకు సిద్ధపడ్డారు. ఈ సమాచారం ఎలా తెలిసిందో గానీ ఆ యువకుని తల్లి అక్కడికి చేరుకొని..ఇలా తన కొడుకుమీద దాడి చేసింది. కొన్ని పెళ్లిళ్లు ఈ విధంగా అభాసు పాలవడం చూస్తున్నాం.. ఇటీవల తమిళనాడులో పెళ్లి పీటల మీద వరుడు వధువు మెడలో తాళి కట్టే సమయానికి ఆ వధువు నిరాకరించి… తన ప్రియుడు ఇక్కడికి వస్తున్నాడని.. ఈ పెళ్లి తనకు వద్దని చెప్పడం.. ఆమె బంధువులు ఆమెపై చెయ్యి చేసుకున్నంత పని జరగడం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి: Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్

Sharmila’s YSRTP: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా