Sharmila’s YSRTP: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల
తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు.
YS Sharmila launched YSRTP: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణగా ఆమె స్వయంగా ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాతో పాటు ఎజెండాను హైదరాబాద్ రాయదుర్గలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సభా వేదికపై వైఎస్ షర్మిల ప్రకటించారు.
పార్టీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు.. 20 శాతం నీలిరంగు మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం.. ఆ మధ్యలో రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి సంధర్బంగా వైఎస్ షర్మిల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తల్లి వైఎస్ విజయలక్ష్మి చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు.
ప్రారంభానికి ముందే…వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పార్టీ జెండాను డిస్‌ప్లే చేశారు. జెండాలో తెలంగాణ మ్యాప్‌లో వైఎస్ఆర్ చేతులు ఊపుకుంటూ అభివాదం చేస్తున్నట్టుగా రూపోందించారు. తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల పేర్లు ఒక్కోక్కటిగా డిస్‌ప్లే అయ్యాయి. ఆ సమయంలోనే తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ బిడ్డా అంటూ క్యాప్షన్ పెట్టారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే తెలంగాణలో తాను పార్టీ పెట్టినట్లు ఇప్పటికే వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఇప్పటికే ఆమె తెలంగాణలో పలు సమస్యలపై నిరసనలు వ్యక్తం చేశారు.