YSRTP Vijayalakshmi: వైఎస్ఆర్ బిడ్డలు దొంగలు కాదు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ భావోద్వేగం

వైఎస్ బిడ్డలు దొంగలు కాదని.. గజదొంగలు కాదు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డలకు పంచడం.. ఇవ్వడమే తెలుసని వైఎస్ విజయమ్మ అన్నారు.

YSRTP Vijayalakshmi: వైఎస్ఆర్ బిడ్డలు దొంగలు కాదు..  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ భావోద్వేగం
Ys Vijaya Lakshmi
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2021 | 6:18 AM

YS Vijayalakshmi emotion in YSRTP meeting: వైఎస్ బిడ్డలు దొంగలు కాదని.. గజదొంగలు కాదు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డలకు పంచడం.. ఇవ్వడమే తెలుసని వైఎస్ విజయమ్మ అన్నారు. హైదరాబాద్ జేర్సీసీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి షర్మిల నేర్చుకుందన్నారు. వైఎస్‌ఆర్ వచ్చాక తెలంగాణలో తుపాకుల మోతలు ఆగిపోయాయని, పల్లె బతికిందన్నారు. రాష్ట్రంలో రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలని ఆలోచించారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ వైఎస్‌ హయాంలోనే మొదలయ్యాయని విజయమ్మ గుర్తు చేశారు. దేవాదుల నుంచి కాళేశ్వరం వరకు వైఎస్సార్ హయాంలోనే శ్రీకారం చుట్టారన్నారు. షర్మిలను మీ కుటుంబంలో ఒకరిగా చూడండని కోరారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోందన్నారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వడానికి ముందుకొస్తున్న షర్మిలను అశీర్వదించాలని ఆమె కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే సమరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, సమస్యలు పరిష్కరించుకుని రెండు రాష్ట్రాలు ఎదగాలని విజయలక్ష్మి అన్నారు. మాటలు మార్చడం వారికి తెలియదని.. మాటకు ప్రాణం ఇచ్చేవాళ్లన్నారు. తమ కుటుంబానికి దాచుకోవడం.. దోచుకోవడం తెలియదన్నారు. వైఎస్‌ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారన్నారు. అదే బాటను ఎంచుకున్న షర్మిలను తెలంగాణ ప్రజలు అదరించాలని విజ్ఞప్తి చేశారు. Read Also…. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!