Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఆధార్ నెంబర్‌తో సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. స్టెప్ బై సెప్ట్ ప్రాసెస్ ఇదే..
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమైంది. నేటి నుంచి రిలీజ్ చేయనుంది. మూడు రోజుల్లో లబ్దిదారులందరికీ అందనున్నాయి. విద్యార్థుల తరపున నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వీటిని వేయనున్నారు. ఒకేసారి అకౌంట్లో రూ.13 వేలు జమ కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం నిధులను బుధవారం నుంచి విడుదల చేస్తోంది. 22వ తేదీన ప్రారంభం కానున్న నిధుల జమ ప్రక్రియ.. 24వ తేదీ వరకు కొనసాగనుంది. మూడు రోజుల్లో లబ్దిదారులందరి అకౌంట్లలో జమ కానున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు గాను రూ.10,120.78 కోట్లను అందించనున్నారు. 42,70,802 మంది తల్లులు, సంరక్షకుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పును వేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది.
తొలి ఏడాది 6727,164 మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు అందించగా.. ఈ సారి లబ్దిదారుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండటంతో పాటు పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కూకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతీ ఏడాది ఆర్ధిక సాయం అందిస్తోంది. ప్రతీ ఏడాది రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రూ.2 వేల నగదును స్కూళ్ల అభివృద్ది కోసం కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తారు. మిగతా రూ.13 వేలు విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే తల్లికి వందనం పథకంలో మీరు అర్హులుగా ఉన్నారా.. మీ అకౌంట్లలో డబ్బులు పడతాయా అనేది సులువుగా తెలుసుకోవచ్చు.
తల్లికి వందనం అర్హుల జాబితా చెక్ చేసుకోవడం ఎలా..?
–https://bm-sgsw.ap.gov.in/BM/ పోర్టల్‌లోకి వెళ్లండి
-హోమ్ పేజీలో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-విద్యార్థి లేదా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలక్ట్ చేసుకోండి
-సెలక్ట్ ఇయర్ కేటగిరీలో 2026-27 ఎంచుకోండి
-అనంతరం గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి
-ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయండి
-అక్కడ మీ కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు స్కీమ్‌కు ఎలిజిబుల్‌నా లేదా అనేది తెలుస్తుంది
ఆఫ్‌లైన్‌లో తెలుసుకోవడం ఎలా..?
తల్లికి వందనం లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. దీంతో మీ పరిధిలోని సచివాలయానికి వెళ్లి చూసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉందో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ మీ పేరు లేకపోతే అక్కడే అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉండి మీ పేరు జాబితాలో లేకపోతే అధికారులు పరిశీలిస్తారు. తుది పరిశీలన అనంతరం మీ పేరును జాబితాలో చేరుస్తారుజ వచ్చే నెల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
