AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయంలో జాలర్ల వలకు సుమారు 40 కిలోల భారీ బొచ్చె చేప చిక్కింది. నలుగురు కలిసి వలను ఒడ్డుకు లాగిన తర్వాత ఈ భారీ మత్స్యం బయటపడింది. చేపను జంగారెడ్డిగూడెం మార్కెట్‌కు తరలించగా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. బహిరంగ వేలంలో ఈ చేపను ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలుకు దక్కించుకున్నాడు.

చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే
Giant Bocha Fish Caught In Eluru Reservoir
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 12:23 PM

Share

ఏలూరు: రిజర్వాయర్ నీటిలో రోజూలాగే ఆ మత్స్యకారుడు వల విసిరాడు.. కానీ ఈసారి నీటి అడుగు నుంచి వచ్చిన బలం జాలర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు కలిసి శ్రమించి ఒడ్డుకు లాగితే కనిపించింది ఒక అరుదైన భారీ మత్స్యం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భారీ బొచ్చె చేప గురించే చర్చ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం, కొంగవారిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయం (ఎర్రకాలువ ప్రాజెక్ట్). లో సుమారు 40 కిలోల అరుదైన ‘బొచ్చె’ (కట్ల) చేప వలకు చిక్కింది. బహిరంగ మార్కెట్ వేలంలో ఏకంగా ఒక్క చేప రూ.10,000 పలికింది. ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి దిన్నిదక్కించుకున్నాడు. స్థానిక జాలర్లు ఉదయాన్నే కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్ట్ నీటిలోకి వేటకు వెళ్లినప్పుడు వలకు భారీగా ఏదో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చి తూకం వేయగా అది ఏకంగా 40 కిలోలు తూగింది. ఇంతటి భారీ చేపను చూడటం స్థానికంగా చాలా అరుదు కావడంతో, వెంటనే దీనిని జంగారెడ్డిగూడెం ప్రధాన చేపల మార్కెట్‌కు తరలించారు.

మార్కెట్‌కు 40 కిలోల బొచ్చె వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో జనం భారీగా తరలివచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. వ్యాపారులు నిర్వహించిన బహిరంగ వేలంలో తీవ్రమైన పోటీ నెలకొనగా, ఏలూరు నుంచి వచ్చిన ఓ వ్యక్తి పది వేల రూపాయలు చెల్లించి ఈ భారీ చేపను దక్కించుకున్నారు. జలాశయాల్లో సహజ సిద్ధంగా పెరిగిన ఇంత పెద్ద చేప దొరకడం ఈ ప్రాంతంలో ఓ విశేషంగా మారింది.

వీడియో చూడండి..

Follow Us