AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు

యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రామప్ప ఆలయానికి నైరుతి దక్కిన ఉన్న అతి పురాతన త్రికూటలయం "గొల్లాల గుడి" కి అరుదైన గుర్తింపు లభించింది.. ఆ గుడికి జాతీయ వారసత్వ సంపద హోదా కల్పిస్తూ కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించిన పురావస్తుశాఖ.. ఆ ఆలయానికి హద్దులు నిర్ణయించి పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంది.

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 10:49 AM

Share
 ఈ త్రికూటాలయం ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయం పక్కనే ఉంటుంది.. రామప్పకు నైరుతి దిక్కున సర్వే నెంబర్ 382/1/2 లో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి ఆదరణ లేక ఇంతకాలం శిధిలావస్థకు చేరుకుంది.. శిల్పసంపద శిధిలమైపోతున్న ఈ ఆలయం పై ఎట్టకేలకు పురావస్తు శాఖ కన్ను పడింది.. ఆలయం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

1 / 5
కాకతీయుల కాలంనాటి ఈ పురాతన ఆలయానికి "జాతీయ ప్రాధాన్యత కల్పిస్తూ భారత పురావస్తు స్మారక చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర పురావస్తుశాఖ ఎట్టకేలకు అధికారిక ముద్ర వేసింది.. 1958 నాటి పురాతన కట్టడాలు , పురాతత్వ ప్రదేశాల చట్ట ప్రకారం ఈ ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటించింది.

2 / 5
ఈ ఆలయానికి జాతీయ హోదా కల్పించి అభివ్రుద్ది చేసేందుకు గత కొంతకాలంగా కేంద్ర పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు..ఈ క్రమంలోనే పురావస్తుశాఖ అధికారులు 2026 ఫిబ్రవరి 16వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.. ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణకు రెండు నెలల గడువు ఇచ్చారు.. ప్రతిపాదనలపై ప్రజల నుండి ఎలాంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ, పురావస్తుశాఖ తుది గెజిట్ అధికారికంగా విడుదల చేశారు..

3 / 5
ఈ త్రికూటాలయం చుట్టూ 382/1/2 & 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని  పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించ బోతుంది.. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ త్రికూటాలయం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యటన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు

4 / 5
రామప్ప లోని రుద్రేశ్వర ఆలయానికి నైరుతిదిశలో ఉన్న ఈ గొల్లాలగుడి తూర్పు ముఖంగా ఉంటుంది.. మూడు గర్భగుడులతో కూడిన త్రికూటాలయంగా కనిపిస్తుంది. ప్రహరీ శిల్ప సంపద, పైకప్పు అంచుల నిర్మాణం ద్వారా బంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో సునిషిత రంద్రాల పనితనంతో ఈ ఆలయం ఎంతో వశిష్టమైనదిగా అలరాడుతుంది.. ప్రధాన గుడి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఉంటాయి.. వీటికి ద్వారపాలకుల విగ్రహాలతో అంతరాయాలు శోభాయమానంగా కనిపిస్తాయి.. ఈ గుడికి ఉత్తర దక్షిణ పశ్చిమ దిశలలో అంతరాళయాలు మూడు గర్భాలయాలకు కనిపిస్తాయి.

5 / 5
Follow Us