అవిలాల ఆంధ్రా గ్రామీణ బ్యాంకులో గోల్డ్ లోన్ రెన్యువల్ కౌంటర్ వద్ద అజాగ్రత్తగా ఉన్న అప్రైజర్‌ను గమనించి, ఓ కేటుగాడు చాకచక్యంగా 60 గ్రాముల బంగారం ప్యాకెట్‌ను కాజేశాడు. పేపర్‌ను అడ్డుపెట్టి క్షణాల్లో దొంగతనం చేసిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.