మంచివే, అయినా వాల్ నట్స్ ఎవరు తినకూడదో తెలుసా?

samatha

03 september 2026

Pic credit - Pinterest

వాల్ నట్స్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు, ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొంత మంది వీటిని తినకూడదంట

కాగా, ఇప్పుడు మనం వాల్ నట్స్ ఎవరు తినకూడదు? ఎవరు వాల్ నట్స్ తినడం  వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం.

కొంత మంది దురద, వంటి అలెర్జీ సమస్యలు ఉంటాయి. అందువలన అలెర్జీ సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు వీటికి దూరం ఉండాలి.

అలాగే కొంత మందికి శ్వాస సమస్యలు ఉంటాయి, గొంతు సమస్యలు, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు వారు కూడా తీసుకోకూడదంట.

గుప్పెడు వాల్ నట్స్‌లో 200 కేలరీలు ఉంటాయి. అందువలన ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు వీటిని తినకూడదంట.

వీలైనంత వరకు చిన్న పిల్లలకు కూడా వీటిని ఇవ్వకపోవడమే మంచిది. వారికి గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉన్నది కాబట్టి అస్సలే ఇవ్వకూడదంట.

వాల్ నట్స్ లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి, అందువలన కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధ పడే వారు కూడా వీలైనంత వరకు వీటికి దూరం ఉండాలి.