నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

31   August 2026

నవ్వు .. దీని గురిచి చెబితే చాలు ముఖంలో చిరు నవ్వు వస్తుంది కదా.. అంతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

నవ్వు నాలుగు విధాలుగా చేటు అంటారు.. కానీ చిన్న చిరునవ్వు నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

కాగా, ఇప్పుడు మనం నవ్వడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి.

నవ్వడం వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నవ్వడం వలన ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

అంతే కాకుండా రోజూ నవ్వడం వలన ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగు పడి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నవ్వు బరువును కూడా తగ్గిస్తుంది. రోజూ 10 నిమిషాలు నవ్వడం వలన 40 కేలరీల వరకు ఖర్చవుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రతి రోజూ కాసేపు నవ్వడం వలన ఇది మెదడు పనితీరును మెరుగు పరిచి, జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

అంతే కాకుండా  నవ్వడం వలన ముఖంలోని కండరాలకు వ్యాయామం జరిగి, ముఖం కాంతివంతంగా, నిగారింపుగా మారుతుంది.