అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
samatha
01 september 2026
Pic credit - Pinterest
అన్నం పర బ్రహ్మ స్వరూపం. ఇక ప్రతి ఇక ప్రతి ఒక్కరూ అన్నం తింటారు. కొంత మంది ఎక్కువ మొత్తంలో తింటే మరి కొందరు తక్కువగా తీసుకుంటారు.
కొంత మంది అయితే చాలా ఎక్కువ మొత్తంలో కేవలం అన్నం మాత్రమే తింటారు. కానీ ఇలా ఎక్కువగా అన్నం తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.
కాగా, ఇప్పుడు మనం అన్నం తినడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఎందుకు ఎక్కువ మొత్తంలో అన్నం తినకూడదో చూద్దాం.
అన్నం ఎక్కువగా తినడం వలన చాలా వేగంగా బరువు పెరుగుతారు. ఎందుకు అంటే ఇందులో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉండ
టం వలన ఇది ఊబకాయానికి కారణం అవుతాయి.
అంతే కాకుండా తెల్ల అన్నం ఎక్కువగా తినడం అస్సలే మంచిది కాదు, దీని వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటీస్ ప్రమాదం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా అన్నం ఎవరు ఎక్కువగా తింటారో వారిలో బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. తినగానే శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఎక్కువగా పెరుగుతుంది.
దీని వలన బద్ధకం, నిద్ర మత్తు, పని మీద ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే ఎక్కువ మొత్తంలో తెల్ల అన్నం తినకపోవడమే మంచిది.
రోజూ ఎక్కువ మొత్తంలో తెల్ల అన్నం తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. వీరికి గుండె జబ్బుల ప్రమాదం చాలా ఎక్కువ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?