గోల్డెన్ ఛాన్స్.. కృష్ణాష్టమి రోజు తులసిని ఇలా పూజిస్తే కోటి జన్మలు పుణ్యం!

samatha

03 september 2026

Pic credit - Pinterest

ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రజలు అందరూ సెప్టెంబర్ 14న జరుపుకోనున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా ఈ సంవత్సరం 15 సంవత్సరాల తర్వాత అష్టమి తిథి, రోహిణి నక్షత్ర కలయికలో కృష్ణాష్టమి రావడంతో, పండుగ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అందువలన ఈ రోజున శ్రీ కృష్ణుడి మాత్రమే కాకుండా తులసిని ఇలా పూజించడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.

కృష్ణాష్టమి రోజు తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది, తులసి లేకుండా కృష్ణుడి పూజ పూర్తి కాదు. అందువలన ఈ రోజు తులసి పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందంట.

దీని కోసం కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి, ఇంటిని శుభ్రం చేసి, తులసి చెట్టు వద్ద శుభ్రం చేసి తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేయాలంట.

సాయంత్రం తులసి దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే జన్మాష్టమి రోజు కృష్ణుడికి తులసి దళాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట.

కృష్ణాష్టమి రోజు తులసిని ముట్టుకుంటే చాలు సకల దోషాలు తొలగిపోతాయి. అందువలన ఈ రోజు తులసి చెట్టును అందంగా అలంకరించి పూజలు చేయాలి.

అలాగే తులసి చెట్టుకు ఎర్రటి వస్త్రం చుట్టి పూజలు చేయడం వలన కోరిన కోరికలు తీరి, సలక దోషాలు తొలిగిపోయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుందంట.