ఇరుముడి వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. 99మందిలో ఒక్క విషపురుగు ఉంటుందన్న శివ నిర్వాణ
బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, భక్తిరస లేదా విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. సాదాసీదాగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఇరుముడి చిత్రంలో ఉపాధ్యాయుని పాత్ర చిత్రీకరణపై కొన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలకు, విమర్శలకు దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. తాజగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. చిత్రం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ.. ఆడపిల్లలు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎలాంటి భద్రతా హామీ ఉండదనే వాస్తవాన్ని ప్రస్తావించారు. బస్సులో, పాఠశాలలో ఎక్కడైనా సమస్యలు తలెత్తవచ్చని, మెజారిటీ ప్రజలు మంచివారైనప్పటికీ, కొద్దిమంది వల్లనే సమస్యలు వస్తాయని, వాటిని చాలా గట్టిగా, హార్డ్ హిట్టింగ్ గా అడ్రస్ చేయాలనుకున్నానని శివ నిర్వాణ తెలిపారు.
మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు
ప్రతి వ్యవస్థలోనూ విష పురుగులు ఉంటాయని, 90 నుంచి 99 శాతం మంది మంచివాళ్లే ఉన్నప్పటికీ, ఒక్క విషపురుగు ఉంటుంది ఆ ఒక్కరి వల్ల వచ్చే సమస్యలపైనే తన సినిమా దృష్టి పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. తాను స్వయంగా ఎం.ఎస్.సి., బి.ఎడ్. పూర్తి చేసి టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉందని, తన మిత్రులు, సహచర ఉపాధ్యాయులు ఈ సినిమా పట్ల గర్వపడుతున్నారని తెలిపారు. తిరుపతిలో ఒక ఉపాధ్యాయురాలు తనను కలిసి, సినిమాలో టీచర్ పాత్ర ఇబ్బంది పెట్టిందని చెప్పినప్పుడు, తాను సినిమా ప్రారంభంలో చూపించిన మంచి ఉపాధ్యాయుడిని గుర్తు చేశానని, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ తప్పు పట్టేలా చూపించలేదని తెలిపారు.
నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..
అలాగే “లైఫ్ ఈజ్ ఏ హార్డ్ రియాలిటీ” అని.. సినిమాలో మణమ్మ వంటి అమ్మాయి నిజం చెప్పి ఉండకపోతే, ఆ స్కాండల్‌లో ఇరుక్కున్న మిగతా అమ్మాయిలందరూ మానసికంగా, శారీరకంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. మణమ్మ మరణం 100 మంది అమ్మాయిలకు ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు శివ నిర్వాణ. అలాగే నిర్మాతలు ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న విజయంపై మాట్లాడుతూ.. తాము సినిమా తీసేటప్పుడు 15-20 కోట్ల నైజాం షేర్, 2 మిలియన్ డాలర్ల ఓవర్సీస్ అంచనాతో ప్రారంభించామని, అయితే సినిమా తమ అంచనాలను మించిపోయిందని, తమనే ఆశ్చర్యపరిచిందని అన్నారు. రవితేజ 200 కోట్ల పోస్టర్ చూసి ఎంతగా సంతోషించారని అన్నారు. ఓటీటీ కమిట్‌మెంట్లు, పైరసీ వంటి సవాళ్లను అధిగమించి సినిమా అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




