AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తన కెరీర్‌లో తనతో కలిసి పనిచేస్తున్న బృంద సభ్యులతో తనకున్న అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే తన కెరీర్ లో ఓ సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్నా కానీ సినిమా ఫ్లాప్ అయ్యిందని అన్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
Allari Naresh
Rajeev Rayala
|

Updated on: Aug 31, 2026 | 7:19 PM

Share

నటుడు అల్లరి నరేష్ త్వరలో రంభ ఊర్వశి మేనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన విజయాలు, అపజయాలపై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన తండ్రి ఒక కామెడీ డైరెక్టర్ అయినప్పటికీ, ఆయన సినిమాలలో ఎంతో లోతైన భావోద్వేగాలు ఉండేవని, ఆయన జీన్ తనలో ఉందని, అందుకే తాను విభిన్న చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కేవలం కామెడీకే పరిమితమైతే బోర్ కొడుతుందని, ఒక నటుడిగా గుర్తింపు రావాలంటే గమ్యం వంటి చిత్రాలు చేయాలని పేర్కొన్నారు. గమ్యం సినిమా తన కెరీర్‌లో తొమ్మిదో సినిమా అని, ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదని నరేష్ వెల్లడించారు. ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని, 32 గాయాలైనా డూప్ లేకుండా ప్రతి ఫైట్, ప్రతి సన్నివేశం చేశానని గుర్తు చేసుకున్నారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

సినిమా ఆడకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, తన కెరీర్ అయిపోయిందేమోనని భయం పట్టుకుందని తెలిపారు. తండ్రిని డబ్బులు అడగాల్సి రావడం కూడా ఇబ్బందిగా అనిపించిందని పంచుకున్నారు. తన రూమ్ నుంచి బయటకు రాకుండా, తలుపులు మూసి, భోజనం కూడా రూమ్‌లోనే చేశానని, ఆ సమయంలో జుట్టు కూడా పూర్తిగా నెరిసిపోయిందని భావోద్వేగంగా చెప్పారు. ఆ సమయంలోనే తన సినిమా ఎందుకు ఆడలేదని, ఎక్కడ తప్పు జరిగిందని ప్రతి సీన్‌ను తిరిగి రాసుకుంటూ విశ్లేషించుకున్నానని తెలిపారు. గమ్యం తర్వాత కొంత కాలానికి కితకితలు సినిమా వచ్చి మళ్లీ తన కెరీర్‌కు ఊపిరి పోసిందని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని నరేష్ అన్నారు.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

అయితే, తన కెరీర్‌లో సుడిగాడు సినిమా ఒక మలుపు అని, ఆ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత అందరూ పెద్దగా బాలేదని చెప్పగా, తను చాలా నిరాశకు గురయ్యానని పేర్కొన్నారు. ఆ సమయంలో హీరో నితిన్ ఒక్కడే తన వద్దకు వచ్చి, “నువ్వు ప్రివ్యూలు ప్రసాద్ ల్యాబ్స్‌లో, మల్టీప్లెక్స్‌లలో కాకుండా మాస్ థియేటర్లకు వెళ్లి చూడు, సత్యం లేదా బ్రహ్మరాంభకు వెళ్తే తెలుస్తుంది” అని సలహా ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. ఆ సలహా విన్న తర్వాతే సుడిగాడు సినిమా పెద్ద విజయం సాధించిందని, ఓపెనింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us