AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటే

నటుడు సమీర్, చిరంజీవి జై చిరంజీవ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వివరించారు. అయ్యప్ప మాల ధారణ కారణంగా షూటింగ్ కు ఆలస్యమైన సమీర్, చిరంజీవి గారి కారవాన్ లోకి పిలిచారని.. అక్కడ చిరంజీవి గారు సమీర్ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారట.

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటే
Actor Sameer
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2026 | 7:10 AM

Share

నటుడు సమీర్ తన సినీ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి గారితో జరిగిన ఒక అత్యంత అరుదైన, మర్చిపోలేని సంఘటనను  ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది జై చిరంజీవ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఉదంతం. అయ్యప్ప మాల ధారణ, షూటింగ్ కు ఆలస్యం కావడం, చిరంజీవి గారు కారవాన్ లోకి పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడటం వంటి పరిణామాలు సమీర్ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఆయన మాట్లాడుతూ.. జై చిరంజీవ షూటింగ్ సమయంలో, సమీర్ అయ్యప్ప మాల వేసుకోవడానికి సిద్ధమయ్యారు. షూటింగ్ ఉదయం 8 గంటలకు డీపీఎస్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో ఉండగా, మాల ధారణ కారణంగా తనకు రెండు గంటల సమయం కావాలని డైరెక్టర్, కో-డైరెక్టర్, దత్తు గారు, ఇతర యూనిట్ సభ్యులకు సమీర్ ముందుగానే తెలియజేశారు. మాల ధారణ గురించి చెప్పినప్పుడు సాధారణంగా ఎవరూ కాదనరని, 10 గంటలకల్లా ఉంటే చాలు అని అన్నారని సమీర్ వెల్లడించారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

సత్యసాయి నిగమంలో మాల ధారణ పూర్తి చేసుకున్న తర్వాత, ఫోన్ చూసుకున్న సమీర్ కు చాలా మిస్డ్ కాల్స్, మెసేజ్ లు కనిపించాయి. చిరంజీవి గారి మేనేజర్ మోహన్ నుంచి ఫోన్లు, మెసేజ్ లు ఉన్నాయని, హీరో గారు అప్పటికే వచ్చి కారవాన్ లో వేచి ఉన్నారని తెలియగానే సమీర్ గుండె ఆగిపోయినంత పనైందట. వెంటనే షూటింగ్ ప్రదేశానికి బయలుదేరిన సమీర్, ఎలా వెళ్లానో కూడా గుర్తులేదని, ఏడు ఎనిమిది నిమిషాల్లోనే అక్కడ చేరుకున్నానని చెప్పారు. అక్కడికి వెళ్లగానే దత్తు గారు ఎదురై, “వెళ్ళండి, వెళ్ళండి, ఫాస్ట్ గా వెళ్ళండి” అని తొందరపెట్టారు. డ్రెస్ మార్చుకుని షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు, తోటి ఆర్టిస్టులు తనను చూసి “వీడు అయిపోయాడు, పాపం వీడి పరిస్థితి ఏంటి” అన్నట్లు జాలిగా చూశారని సమీర్ గుర్తుచేసుకున్నారు.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

చిరంజీవి గారు వచ్చి అందరికీ విష్ చేసినా, సమీర్ ను మాత్రం ఒక నిమిషం నిలబడమని, “ఏమ్మా బాగున్నావా?” అని అడిగి వెళ్లిపోయారు. దీంతో ఆ రోజు ఎలాంటి సంఘటనలు జరగలేదు,  తర్వాత షూటింగ్ పూర్తయ్యింది. సమీర్, తోటి నటులు కూడా అంత పెద్ద విషయం ఏమీ జరగలేదని ఆశ్చర్యపోయారు. తరువాతి రోజు, తెల్లాపూర్ లో అంజనేయస్వామి దగ్గర చిత్రీకరణ జరుగుతుండగా, హీరో గారికి 15 నిమిషాల సమయం ఉందని డైరెక్టర్ గారు చెప్పారు. చిరంజీవి గారు ఆ సమయంలో “సమీర్ కి ఎంత సేపు ఉంది?” అని అడిగారు. తన గురించి చిరంజీవి గారు అడగడం ఆశ్చర్యం కలిగించిందని సమీర్ తెలిపారు. “ఆయన మీతోటే ఉందండి 15 నిమిషాల సమయం” అని డైరెక్టర్ చెప్పగా, “సమీర్ నువ్వు ఒకసారి నాతో రా అమ్మ” అని చిరంజీవి గారు పిలిచారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

కారవాన్ లోకి వెళ్ళాక, బయట ఎవరూ రాకుండా 10 నిమిషాలు ఎవరినీ లోపలికి పంపించవద్దని కుర్రాడికి చిరంజీవి గారు చెప్పారట. తామిద్దరూ లోపల కూర్చున్న తర్వాత, చిరంజీవి గారు “ఏం అమ్మా ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావ్ ఇంకా?” అని మామూలుగానే మాట్లాడారట.. ఆ తర్వాత అసలు విషయం ప్రస్తావిస్తూ.. “నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్ లో నాకు ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా, ఒక వ్యక్తి గురించి క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను. నీ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉండి నిన్ను పిలిచాను” అని చెప్పారు. “ఏ నువ్వు నీ పేరు సమీర్ అంటావ్, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడతావ్, మాల వేసుకుంటావ్. అయ్యప్ప మాల ఏదో వేసుకున్నావంట కదా నిన్న” అని చిరంజీవి గారు అడిగారు. “నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ దీనికి సింక్ లేదు, పొంతన లేదు. ఏంటి మ్యాటర్?” అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు సమీర్ తన తల్లి బ్రాహ్మిణ్ అని వివరించారు. అది వినగానే చిరంజీవి గారు “అయ్య బాబోయ్ ఏంటి నార్త్ పోల్, సౌత్ పోల్. అబ్బా అబ్బా లక్కీ ఫెలో నువ్వు, మంచి బ్రాండ్ నువ్వు, బ్రీడ్ నువ్వు” అంటూ సమీర్ ను ప్రశంసించారట. ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేనిది అని సమీర్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us