AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy : వరంగల్ ఎయిర్ పోర్టుకు పేర్లు చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

వరంగల్ ఎయిర్ పోర్టుకు పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పలు పేర్లు సూచించారు. తన సొంత ప్రాంతమైన వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు కానుండడంపై సంతోషం వ్యక్తం చేస్తూ తనకు రెండు పేర్లను సూచించారు. ఇక సందీప్ రెడ్డి ట్వీట్లకు సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు.

CM Revanth Reddy : వరంగల్ ఎయిర్ పోర్టుకు పేర్లు చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Cm Revanth Reddy, Sandeep R
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2026 | 6:41 AM

Share

వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం అనేది ఆ ప్రాంత వాసుల దశాబ్దాల కల. అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల నుంచి సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు కోరారు. ఈ క్రమంలోనే తాజాగా తమ దశాబ్దల కల నెరవేరిన సందర్భంగా వరంగల్ ప్రాంతానికి చెందిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సొంత పట్టణానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు సందీప్ రెడ్డి రెండు పేర్లను సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RIA), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KIA) వంటి చారిత్రక పేర్లను సూచిస్తూ సందీప్ రెడ్డి వంగా వరుస ట్వీట్స్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఆయన సూచనకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ‘దట్స్ ది స్పిరిట్..’ అంటూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. సీఎం స్పందన పట్ల సంతోషాన్ని తెలియజేస్తూ తను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న “స్పిరిట్” సినిమాలో దట్స్ ది స్పిరిట్ అనే డైలాగ్ ను రాశానని, అదే మాట సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం ఆనందంగా ఉందని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సోషల్ మీడియా ద్వారా జరిగిన ఈ సంభాషణ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

సందీప్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న లేటేస్ట్ మూవీ స్పిరిట్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

సందీప్ రెడ్డి ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us