నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది.. విజయ్‌తో క్వాలిటీ టైం గడిపానన్న రష్మిక మందన్న
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత రష్మిక తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’, అలాగే లేడి ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటుంది రష్మిక.

అందాల భామ రష్మిక మందన్న ఇటీవలే గాయం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. అలాగే లేడి ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటుంది రష్మిక. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. దాంతో రష్మిక అభిమానులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. తన ఆరోగ్యం పై రష్మిక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. మొన్నామధ్య.. సోషల్ మీడియాలో “గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయిందీ.. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. నా తుంటికి కాలును కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటికి సంబంధించి ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఇలా జరిగింది.
మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు
నేను చేసిన సినిమాల్లో మైసా అత్యంత కఠినమైన సినిమా.. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు నాకు ఈ గాయం ఇచ్చాడు అనుకుంటా అంటూ రాసుకొచ్చింది రష్మిక. తాజాగా మరో పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. పెళ్లి తర్వాత సినిమాల కారణంగా నా భర్తతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా.. పెళ్లి తర్వాత నేను విజయ్ దేవరకొండ దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరం చూసుకోలేదని తెలిపింది రష్మిక. ప్రకృతి నన్ను ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి మా ఇద్దరికీ ఈ క్వాలిటీ టైమ్ ఇచ్చిందేమో.. ఈ చిన్న గ్యాప్ మా ఇద్దరికీ చాలా స్పెషల్ అని రష్మిక తెలిపింది.
నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..
అలాగే విజయ్‌కు ఎక్కువగా సీరియస్ డ్రామాలు, షోలు అంటే ఇష్టం. నాకేమో కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. మేమిద్దరం కలిసి ఇంట్లో కూర్చొని రెండూ చూశాం. మా ఆయనకు కూడా కే-డ్రామాలు అలవాటు చేసేశా అని రష్మిక చెప్పుకొచ్చింది. అలాగే రష్మిక చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ.. ఇద్దరం ఇలా ఇంట్లో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది కానీ ఇకపై ఇలాంటి క్వాలిటీ టైం గాయాలు లేకుండా దక్కితే బాగుంటుందిఇద్దరం కలిసి ఇంట్లో ఆనందంగా గడిపాం అని తెలిపాడు.
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




