2024 ఎండింగ్‎లో ఓటీటీలో సందడి చేస్తున్నది ఎవరు.? 

27 December 2024

Battula Prudvi

హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘గ్లాడియేటర్ II’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘భైరతి రణగల్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 26 నుంచి సందడి చేస్తుంది.

గేమింగ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్  ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ ఈ నెల 26 నుంచి నెట్‎ఫ్లిక్స్‎లో ప్రసారం అవుతుంది.

‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీ సినిమా నెట్‌ఫ్లిక్స్‎లో ఈ నెల 27 నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది.

రొమాంటిక్ ఫాంటసీ డ్రామా  ‘జెనీ’ ఈ నెల 27న జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. జయం రవి, కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రధారులు.

హిందీ హారర్ కామెడీ డ్రామా చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ డిసెంబర్ 27 నుంచి నెట్‎ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

డిసెంబర్ 27 అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ లో సందడి చేస్తుంది బాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘సింగం అగైన్’.

‘సొర్గవాసల్’ అనే తమిళ డ్రామా చిత్రం డిసెంబర్ 28 నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.