Bandla Ganesh: హీరోగా మారనున్న బండ్ల గణేష్‌.. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌.. ఈసారైనా పక్కానా.?

Bandla Ganesh: కమెడియన్‌గా తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు నటుడు బండ్ల గణేష్‌. అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన గణేష్‌.. అనూహ్యంగా ఒక్కసారిగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా మారారు. రవితేజ హీరోగా తెరకెక్కిన..

Bandla Ganesh: హీరోగా మారనున్న బండ్ల గణేష్‌.. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌.. ఈసారైనా పక్కానా.?
Bandla Ganesh As Hero
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2021 | 4:13 PM

Bandla Ganesh: కమెడియన్‌గా తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు నటుడు బండ్ల గణేష్‌. అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన గణేష్‌.. అనూహ్యంగా ఒక్కసారిగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా మారారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల.. వరుసగా బడా సినిమాలు నిర్మించారు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ ప్రొడ్యూసర్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు బండ్ల గణేష్‌. ఇక చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’తో మరోసారి వెండితెరపై కనిపించారు.

ఇదిలా ఉంటే బండ్ల గణేష్‌ హీరోగా మారనున్నాడనే వార్త అప్పట్లో బాగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘మండెల’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారని అందులో గణేష్ హీరోగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే గణేష్‌ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారనని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బండ్ల హీరో అవతారమెత్తనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వెంకట్‌ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో గణేష్‌ ఈ సినిమాకు పచ్చ జెండా ఊపారని సదరు వార్తల సారాంశం. ఇక ఈ సినిమాకు స్వయంగా ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారనే టాక్‌ కూడా నడుస్తోంది. మరి ఈ వార్తలో అయినా నిజం ఉందా.? లేదా వట్టి పుకారేనా అని తెలియాలంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Bigg Boss Divi: ‘ఆ మాట విన‌గానే ఉక్కిరిబిక్కిరి అయ్యాను’.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది.

మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. సెలబ్రెటీలకు కొకైన్ సప్లయి చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు…

Shanmukh Jaswanth: సేమ్ సీన్ రిపీట్.. మరోసారి ఫ్యాన్స్‏ను ఏడిపించిన షణ్ముఖ్.. ‘సూర్య’ వెబ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ అదుర్స్..