మహేష్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న.. స్టోరీ ఇదే అంటూ హింట్ ఇచ్చిన రచయిత..

మహేష్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న.. స్టోరీ ఇదే అంటూ హింట్ ఇచ్చిన రచయిత..
Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ ఉండదు.

Rajeev Rayala

|

Jul 06, 2021 | 3:46 PM

SS Rajamouli Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ ఉండదు. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర మహేష్తో జక్కన ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. ఆ మధ్య  ఈ సినిమా ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీ అంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ మరో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో  ఓ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్  చేయాలని చూస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ”మహేష్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయని, కొన్ని ఐడియాలు అనుకుంటున్నాం అని అన్నారు. అయితే మహేష్ తో ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అదెలా చేయగలమని ఆలోచిస్తున్నాం. దాని మీద కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంది” అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దాదాపు చివరిదశకు వచ్చేసింది. అటు మహేష్ బాబు పరశురామ్ దర్శకతంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ సినిమా పై దృష్టి పెట్టనున్నాడు జక్కన.

మరిన్ని ఇక్కడ చదవండి :

Varun Tej : టాలీవుడ్ టూ బాలీవుడ్… హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతున్న మెగా హీరో

Top 10 TRP Ratings Movies: బార్క్ వచ్చిన తర్వాత అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు ఏమిటో తెలుసా

Mehreen Pirzada: ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేది.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ మెహ్రీన్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu