Bonda Mani: స్టార్ కమెడియన్ కన్నుమూత.. కుటుంబ సభ్యులకు కెప్టెన్ విజయ కాంత్ ఆర్థిక సాయం
డయాలసిస్‌కు భారీగా ఖర్చు అవుతుండడం, తన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు బోండామణికి ఆర్థిక సాయం అందజేస్తూ వచ్చారు. అయితే శనివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గుర్తించి నటుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే బోండామణి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండామణి (60) కన్నుమూశారు. కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. సుమారు 250కు పైగా సినిమాల్లో నటించిన బోండామణి తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వడివేలు వంటి సీనియర్ నటీనటులతో కలిసి పనిచేశారాయన. గత కొంత కాలంగా బోండా మణి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు దెబ్బతినడంతో చెన్నైలోని ప్రభుత్వాస్పత్రిలో ఏడాదికి పైగా చికిత్స తీసుకుంటున్నారు. డయాలసిస్‌కు భారీగా ఖర్చు అవుతుండడం, తన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు బోండామణికి ఆర్థిక సాయం అందజేస్తూ వచ్చారు. అయితే శనివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గుర్తించి నటుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే బోండామణి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులు అర్పించారు.
బోండామణికి భార్య మాధవి, కుమారుడు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. ఇంటి పెద్ద మరణించడంతో వీరంతా కన్నీరుమున్నీరవుతున్నారు. బోండామణి కుమారుడు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని వాపోయాడు. నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో కమెడియన్ బోండామణి మృతి పట్ల ప్రముఖ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు కష్టాల్లో ఉన్న కమెడియన్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నటుడు మీసై రాజేంద్రన్ ఈ ఆర్థిక సాయాన్ని బోండామణి భార్యకు అందించారు. ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు.
కెప్టెన్ విజయ కాంత్ సంతాపం..
பிரபல நகைச்சுவை நடிகர் போண்டா மணி உடல்நலக் குறைவால் காலமானார் என்ற செய்தி கேட்டு அதிர்ச்சியும் வேதனையுமடைந்தேன். என் மீது மிகுந்த அன்பும், நட்பும், மரியாதையும் கொண்ட நல்ல மனிதர். அவரை இழந்து வாடும் குடும்பத்தினருக்கும், உற்றார் உறவினர்களுக்கும், மற்றும் (1-2) #போண்டாமணி pic.twitter.com/6v2CgrYd3a
— Vijayakant (@iVijayakant) December 24, 2023
కిడ్నీ సమస్యలతో బాధపడుతూ..
உயிர் உள்ளவரை முதல்வர் ஸ்டாலினை மறக்க முடியாது😢… @mkstalin#minnambalam #stalin #mkstalin #admk #dmk #bondamani #ripbondamani #comedian #bondamanicomedy #tamilcinema pic.twitter.com/fIZLJqJSvK
— Minnambalam (@Minnambalamnews) December 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








