Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
బిగ్‌బాస్ ఫినాలే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకుంది. స్టూడియోస్ వద్దకు భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు తొలుత వాగ్వాదానికి దిగారు. టైటిల్ విజేతగా ప్రశాంత్‌ను ప్రకటించిన తర్వాత ఏకంగా కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో కొందరు అమర్‌దీప్, అశ్వినీ, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతు రాయల్ కార్లను ధ్వంసం చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే సంధర్భంగా అన్నపూర్ణ స్టూడియో సమీపంలో జరిగిన ప్రభుత్వ, ప్రవేట్ ఆస్తుల ధ్వంసం, అల్లర్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడకు చెందిన సుధాకర్, పవన్, సరూర్‌నగర్‌కు చెందిన అవినాష్‌రెడ్డి అనే విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన విధ్వంసం, దాడి ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని సూచించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రశాంత్ తాజాగా తన తోటి కంటెస్టెంట్స్ శివాజీ, యావర్, భోలేలను కలిశాడు.
అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్ ఫినాలే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకుంది. స్టూడియోస్ వద్దకు భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు తొలుత వాగ్వాదానికి దిగారు. టైటిల్ విజేతగా ప్రశాంత్‌ను ప్రకటించిన తర్వాత ఏకంగా కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో కొందరు అమర్‌దీప్, అశ్వినీ, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతు రాయల్ కార్లను ధ్వంసం చేశారు. కార్ల అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో అక్కడికి వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన పోలీసుల బస్సు అద్దాన్ని సైతం పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని అభియోగాలు నమోదు చేవారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. పోలీసులను వారిని అదుపులోకి తీసుకుని.. కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కండీషన్ బెయిల్ లభించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




