Vijay Deverakonda: అనసూయ ఇష్యు పై విజయ్ క్రేజీ కామెంట్.. ఏమన్నాడంటే

తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆతర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకున్నాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో విజయ్ కు వరస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆతర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ థియేటర్స్ లో మంచి కెలెక్షన్స్ రాబట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్.

Vijay Deverakonda: అనసూయ ఇష్యు పై విజయ్ క్రేజీ కామెంట్.. ఏమన్నాడంటే
Vijay Deverakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 10, 2023 | 1:06 PM

ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు . లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు విజయ్. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకున్నాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో విజయ్ కు వరస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆతర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ థియేటర్స్ లో మంచి కెలెక్షన్స్ రాబట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్. చివరిగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక ఇప్పుడు ఖుషి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందమైన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను  ఆకట్టుకుంటుంది.

ఈ ట్రైలర్ లో బార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను చూపించారు. ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆతర్వాత వారి జీవితంలో వచ్చిన చిన్న చిన్న గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తన పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని ఎందుకు పెట్టుకున్నారో తెలిపారు. చాలా మంది రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కొంతమంది రౌడీ హీరో, సౌత్ సెన్సేషన్ స్టార్ ఇలా ఇష్టమొచ్చిన ట్యాగ్ లు ఇస్తున్నారు. నాకు మా అమ్మ నాన్న విజయ్ దేవరకొండ అనే పేరు పెట్టారు. నాకు విజయ్ దేవరకొండగా సరిపోతుంది. విజయ్ దేవరకొండ ఒకడే ఉన్నాడు. అందుకే ది విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నా అని క్లారిటీ ఇచ్చాడు. గతంలో అనసూయ ఇదే విషయం పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అనసూయ వివాదం గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా అది గొడవ చేసే వాళ్ళను అడగాలి అంటూ సమాధానం ఇచ్చాడు విజయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..