- Telugu News Photo Gallery Cinema photos Heroine Aditi Rao Hydari react on casting couch 10 08 2023 Telugu Actress Photos
Aditi Rao Hydari: ఇండస్ట్రీలో అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి.. లొంగిపోకూడదు..: అదితి రావ్ హైదరి.
అదితిరావ్ హైదరి.. పరిచయం అక్కర్లేని పేరు.. చెలియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. యూనిక్ స్టైల్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.
Updated on: Aug 10, 2023 | 12:48 PM

సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి ఎలా ఉన్నా.. హీరోయిన్‌కు అవకాశాలు రావాలంటే మాత్రం ఎప్పుడు న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతుండాలి. ఈ సూత్రాన్ని పర్ఫెక్ట్‌గా అర్ధం చేసుకున్నారు హైదరాబాదీ బ్యూటీ అదితి రావ్ హైదరీ. అందుకే సినిమాతో సంబంధం లేకుండా ఏదో ఒక టాపిక్‌తో ఎప్పుడూ న్యూస్‌లో ఉండేలా చూసుకుంటున్నారు.

సక్సెస్‌తో సంబంధం లేకుండా కొంత మంది స్టార్స్‌కు ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాంటి క్రేజీ బ్యూటీనే అదితిరావ్ హైదరీ.

హైదరాబాదీ అమ్మాయే అయిన ఈ మోడల్ కమ్ యాక్ట్రసెస్... మల్టీ లింగ్యువల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ... న్యూస్‌లో మాత్రం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు

రీసెంట్ టైమ్స్‌లో అదితి రిలేషన్‌షిప్ స్టేటస్ విషయంలో గట్టి చర్చే జరుగుతోంది. కోలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై ఇద్దరి వైపు నుంచి క్లారిటీ అయితే రాలేదు.

తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయంలోనూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అదితి. మీటూ పేరుతో ఎవరినో నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఇష్టపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చిన తరువాత మళ్లీ దాని గురించి రచ్చ చేయటం కరెక్ట్ కాదన్నారు.

ఇండస్ట్రీలో అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకూడదంటూ సజెషన్ ఇచ్చారు. ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ... స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న కోరిక తనకు లేదన్న హింట్ ఇస్తున్నారు.





























