భోళాశంకర్ రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమా ఒరిజినల్ వర్షన్ వేదాలం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు మెహర్ రమేష్. శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదాలం తనకు ఎంతో నచ్చిందని, ముఖ్యంగా ఆ సినిమాలో అన్న చెల్లెల్ల సెంటిమెంట్‌ను చూపించిన విధానం ఆకట్టుకుందని చెప్పారు. ఆ కథను మెగా ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి భోళా శంకర్ తెరకెక్కించామన్నారు.