AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom: ప్రి రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తల్లి ఎమోషనల్.. ఎందుకంటే..?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తల్లి మాధవి దేవరకొండ మౌనంగా ప్రార్థించిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ స్పీచ్‌లో సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పినప్పుడు ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kingdom: ప్రి రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తల్లి ఎమోషనల్.. ఎందుకంటే..?
Vijay Devarakonda with his mom
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2025 | 3:50 PM

Share

జూలై 31న విడుదల కానున్న కింగ్‌డమ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక్క విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. అనిరుధ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఎమోషనల్ మూమెంట్ మాత్రం అందర్నీ కదిలించింది. ఈవెంట్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. “ఈ సినిమా నాకు, విజయ్‌కి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది” అంటూ అనిరుధ్ ఎమోషనల్‌గా మాట్లాడినప్పుడు… స్టేజ్ ముందు కూర్చున్న విజయ్ దేవరకొండ తల్లి మాధవి.. కంటి నిండా చెమ్మతో మౌనంగా ప్రార్థన చేసిన దృశ్యం వైరల్ అయింది.

ఈ మూమెంట్స్‌ను ArtistryBuz ఇన్‌స్టా పేజ్ షేర్ చేయగా… నెటిజన్లు వెంటనే స్పందించారు. అమ్మ ప్రార్థించేది ఎప్పుడూ బిడ్డ సంతోషం, సక్సెస్ కోసమే అని ఒకరు కామెంట్ పెట్టగా.. ఇదొక బ్యూటీఫుల్ మూమెంట్ అని మరొకరు రాసుకొచ్చారు. విజయ్ అన్న అమ్మ కోసం అయినా ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తాం అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

‘ కింగ్‌డమ్’ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక అండర్‌కవర్ స్పై పాత్రలో కనిపించనున్నాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే… అతను ఎదుర్కొనాల్సిన క్రైమ్ సిండికేట్‌ను తన అన్న సివా లీడ్ చేయడం. ఆ పరిణామాల చుట్టూనే కథ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, గౌతమ్ తిన్ననూరి (జెర్సీ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌కి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనిరుధ్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లైగర్ తర్వాత విజయ్ బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నప్పటికీ… ‘Kingdom’తో ఆయన మళ్లీ ఫోకస్‌లోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు రౌడీ అయ్యారు. ఇటీవల డెంగ్యూ బారిన పడి.. కోలుకుని.. మూవీ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నాడు.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?